అజిత్ జైన్ (బెర్క్‌షైర్ హాత్వేకి ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న భారతీయ-అమెరికన్ ఎగ్జిక్యూటివ్)
అన్షుమాన్ జైన్ (1963 జనవరి 7 - 2022 ఆగస్టు 12) భారత సంతతికి చెందిన ప్రముఖ బ్యాంకర్. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు.[2][3] అమెరికన్ ఆర్థిక సేవల సంస్థ కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ అధ్యక్షుడిగా 2017 నుండి 2022 వరకు ఆయన పనిచేశాడు.[4]
జూన్ 2012 నుండి జూలై 2015 వరకు ఆయన జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డాయిష్ బ్యాంక్ గ్లోబల్ కో-సీఆఒ, కో-ఛైర్మన్‌గా వ్యవహరించాడు.[5][6][7] ఆయన డ్యుయిష్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుడు కూడా. అతను గతంలో దాని కార్పొరేట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కు అధిపతిగా ఉన్నాడు. డ్యుయిష్ బ్యాంక్ కార్పొరేట్ ఫైనాన్స్, సేల్స్, ట్రేడింగ్, లావాదేవీ బ్యాంకింగ్ వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా బాధ్యత వహించాడు. అంతేకాకుండా జనవరి 2016 వరకు ఆ బ్యాంకుకు అన్షు జైన్ సలహాదారుగా ఉన్నాడు.
జైపూర్‌లో 1963 జనవరి 7న అన్షు జైన్ జన్మించాడు. అతని తండ్రి సివిల్ సర్వెంట్.[8] అన్షు జైన్ ఆరు సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి న్యూఢిల్లీకి వెళ్లి, మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివాడు.[9] అలాగే ఆయన 1983లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించాడు.[10] ఆ తర్వాత అతను 19 సంవత్సరాల వయస్సులో అమెరికాకి వెళ్లాడు.[11][12] అక్కడ 1985లో ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఫైనాన్స్‌లో ఆయన ఎం.బి.ఎ పట్టా పొందాడు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ డెరివేటివ్స్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులలో నిపుణుడైన థామస్ ష్నీవీస్‌తో కలిసి ఆయన చదువుకున్నాడు.[13][14]
జైన్ ట్రావెల్ రైటర్, పిల్లల పుస్తక రచయిత్రి అయిన గీతికను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరు లండన్‌లో నివసించారు. అలాగే న్యూయార్క్ నగరంలో కూడా నివాసం కలిగి ఉన్నారు.