అపరశక్తి ఖురానా | |
---|---|
జననం | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అకృతి అహుజా ఖురానా (m. 2014) |
పిల్లలు | 1 |
బంధువులు | ఆయుష్మాన్ ఖురానా (సోదరుడు) |
అపరశక్తి ఖురానా (జననం 1987 నవంబరు 18) ఒక భారతీయ నటుడు, రేడియో జాకీ, హాస్యనటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, టెలివిజన్ హోస్ట్. అంతేకాకుండా, ఆయన హర్యానా U-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన మాజీ భారతీయ క్రికెటర్.[1] ఆయన నటుడు ఆయుష్మాన్ ఖురానాకు తమ్ముడు.[2]
అపరశక్తి ఖురానా మొట్టమొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ బయోపిక్ దంగల్ (2016). ఇది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అతనికి అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది. అతను తదనంతరం బద్రీనాథ్ కి దుల్హనియా (2017), స్త్రీ (2018), లుకా చుప్పి (2019), పతి పత్నీ ఔర్ వో (2019) వంటి అనేక ఇతర వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు. 2021లో, అతను సోలో లీడ్‌గా తన మొదటి చిత్రం హెల్మెట్‌లో నటించాడు.
ఆయన 1987 నవంబరు 18న చండీగఢ్‌లో జన్మించాడు. అతని తండ్రి పి. ఖురానా జ్యోతిష్యుడు, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన రచయిత, అయితే అతని తల్లి పూనమ్ సగం బర్మీస్ సంతతికి చెందిన గృహిణి.
చండీగఢ్‌లో పాఠశాల విద్య, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ఆయన పూర్తి చేశాడు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలలో చురుకుగా ఉండే ఆయన హర్యానా U-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అయ్యాడు. అతను ఢిల్లీలోని ఐఐఎంసి నుండి మాస్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు.
అతను 2014 సెప్టెంబరు 7న వ్యాపారవేత్త, ఐఎస్బీ గ్రాడ్యుయేట్ అయిన ఆకృతి అహుజాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021న ఆగస్టు 27న అర్జోయ్ ఎ ఖురానా అనే పాప జన్మించింది.
సంవత్సరం | టైటిల్ | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2016 | దంగల్ | ఓంకార్ సింగ్ ఫోగట్ | [3] |
సాత్ ఉచక్కీ | ఖప్పే | [4] | |
2017 | బద్రీనాథ్ కీ దుల్హనియా | భూషణ్ మిశ్రా | [5] |
2018 | హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ | అమన్ సింగ్ వాధ్వా | [6] |
స్త్రీ | బిట్టు | [7] | |
రాజ్మా చావల్ | బల్జీత్ | [8] | |
2019 | లుకా చుప్పి | అబ్బాస్ షేక్ | [9] |
జబరియా జోడి | సంతోష్ పాఠక్ | [10] | |
కాన్పురియే | జైతాన్ మిశ్రా | [11] | |
బాలా | అర్జున్ సింగ్ | [12] | |
పతి పత్నీ ఔర్ వో | ఫాహిమ్ రిజ్వీ | [13] | |
2020 | స్ట్రీట్ డ్యాన్సర్ 3డి | అమరీందర్ | [14] |
2021 | హెల్మెట్ | లక్కీ | [15] |
హమ్ దో హమారే దో | సందీప్ "షంటీ" సచ్‌దేవా | [16] | |
2022 | ధోఖా: రౌండ్ డి కార్నర్ | హక్ రియాజ్ గుల్ | [17] |
భేదియా | బిట్టు | [17] |