అప్పట్లో ఒకడుండేవాడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | సాగర్ కె చంద్ర |
రచన | సాగర్ కె. చంద్ర |
నిర్మాత | ప్రశాంతి, కృష్ణ విజయ్ |
తారాగణం | శ్రీవిష్ణు నారా రోహిత్ బ్రహ్మాజీ రాజీవ్ కనకాల |
ఛాయాగ్రహణం | నవీన్ యాదవ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 30 డిసెంబరు 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అప్పట్లో ఒకడుండేవాడు 2016 డిసెంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. నారా రోహిత్ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించాడు.[1] [2][3][4]
అప్పట్లో (1990ల కాలంలో) ఒకడుండేవాడు... ఒక సగటు మధ్య తరగతి యువకుడు. తల్లి రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే, రైల్వే కాలనీలో పెరుగుతాడు. క్రికెట్ అంటే పిచ్చి. డిస్ట్రిక్ లెవల్లో ఆడుతుంటాడు. అందరూ అతడిని రైల్వే రాజు (శ్రీవిష్ణు) అని పిలుస్తుంటారు. రంజీల్లోకి సెలక్ట్ అయి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని, ప్రేమించిన నిత్యని (తాన్య) పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకుంటాడు. ఏం జరిగినా తలొంచుకుని వెళ్లిపోవడమే తప్ప తెగించి ఎదురెళ్లని మనస్తత్వమున్న ఈ మధ్య తరగతి యువకుడివి చిన్న కలలు. తనకి సంబంధం లేని విషయాల వల్ల అతని జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. కలలు కల్లలైపోతాయి. క్రికెటర్ అవుదామని అనుకున్నవాడల్లా కొన్ని సంఘటనల అనంతరం క్రిమినల్ అయిపోతాడు. వృత్తి నిర్వహణలో భాగంగా ముల్లుని ముల్లుగా చూడడమే తప్ప, ఇక మరి దేనిగురించి ఖాతరు చేయని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) కారణంగా రైల్వే రాజు జీవితం తలకిందులైపోతుంది. ఇక ఇంతియాజ్ పతనం చూసేందుకే రాజు కంకణం కట్టుకుంటాడు.[5]