వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లక్నో, బ్రిటిష్ ఇండియా | 1939 డిసెంబరు 31|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2002 ఫిబ్రవరి 25 కరాచీ, సింధ్, పాకిస్తాన్ | (వయసు 62)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి-చేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 38) | 1961 అక్టోబరు 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1964 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2014 మే 7 |
అఫాక్ హుస్సేన్ (1939, డిసెంబరు 31 – 2002, ఫిబ్రవరి 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1961 నుండి 1964 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
అఫాక్ హుస్సేన్ 1939, డిసెంబరు 31న లక్నోలో జన్మించాడు.
అఫాక్ హుస్సేన్ టెస్ట్ క్రికెట్‌లో అద్వితీయమైన రికార్డును కలిగి ఉన్నాడు, ఔట్ కాకుండానే అత్యధిక టెస్ట్ పరుగులు (66) సాధించాడు.[2] 1961 అక్టోబరులో లాహోర్‌లో ఇంగ్లండ్‌పై 10*, 35* పరుగులు చేశాడు. 1964 డిసెంబరులో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 8*, 13* పరుగులు చేశాడు.[1]
1962లో పాకిస్థాన్ జట్టుతో పాటు, 1963లో పాకిస్థాన్ ఈగలెట్స్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1964-65లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించిన పాకిస్థాన్ జట్టులో భాగమయ్యాడు.
ఆఫ్-స్పిన్ బౌలర్ గా,[3] లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. హుస్సేన్ 1957, 1974 మధ్య పాకిస్తాన్‌లోని వివిధ ఫస్ట్-క్లాస్ జట్లకు ఆడాడు. 1960-61లో రైల్వేస్, క్వెట్టా జట్టుకు వ్యతిరేకంగా కరాచీ విశ్వవిద్యాలయం తరపున 108 పరుగులకు 8 వికెట్లు తీశాడు.[4] 1969-70లో లాహోర్ బి పై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తరపున 122 నాటౌట్ అత్యధిక స్కోరు చేశాడు.[5]
అఫాక్ హుస్సేన్ 2002, ఫిబ్రవరి 25న పాకిస్తాన్ లోరి కరాచీలో మరణించాడు.