అబద్ధం (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలాచందర్ |
---|---|
నిర్మాణం | ప్రకాష్ రాజ్ |
కథ | కె.బాలాచందర్ |
చిత్రానువాదం | కె.బాలాచందర్ |
తారాగణం | ఉదయ్ కిరణ్ విమల ప్రకాష్ రాజ్ |
సంగీతం | విద్యాసాగర్ |
భాష | తెలుగు |
అబద్ధం 2006 లో విడదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రకాష్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకు కె.బాలాచందర్ దర్శకత్వం వహించాడు. ఉదయ్ కిరణ్, విమల, ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.
అబద్దం తమిళ చిత్రం "పోయి" యొక్క రీమేక్ వెర్షన్. ఇది రొమాన్స్ ఆధారిత చిత్రం, ఇందులో వేమన (ఉదయ్ కిరణ్) ఒక గొప్ప రాజకీయ నాయకుడి కుమారుడు. అతను తన ఆదర్శవాద తండ్రితో గొడవపడి ఇంటి నుండి శ్రీలంకకు పారిపోతాడు. అతను తన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు.
వేమన మొదటి చూపులోనే తెలుగు అమ్మాయి శిల్ప (విమల) తో ప్రేమలో పడతాడు. శిల్పా కొలంబోలో తన సోదరిని సందర్శించింది. ఆమె సివిల్ సర్వంట్ కావాలని కోరుకుంటుంది. వృత్తిని కోరుకునే మహిళలకు ప్రేమ, వివాహం ఒక అడ్డంకి అని ఆమె భావిస్తుంది.
మిగిలిన కథ అతని కెరీర్, ప్రేమ మధ్య భావోద్వేగ సంఘర్షణ గురించి ఉంటుంది.[1]
{{cite web}}
: CS1 maint: url-status (link)