వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | మన్నార్, అలప్పుజా, కేరళ | 1968 ఆగస్టు 4|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4 |
అబే కురువిళా (జననం 1968 ఆగస్టు 4) భారతీయ మాజీ క్రికెటరు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) జనరల్ మేనేజరు. అతను 1990ల మధ్యలో భారత క్రికెట్ జట్టులో బౌలర్‌గా ఆడాడు. అతను బీసీసీఐకి సెలక్టర్‌గా ఉన్నాడు. [1]
కురువిళా ఆరడుగుల ఆరంగుళాల ఎత్తుకు ప్రసిద్ది చెందాడు.[2] అతను ముంబైలోని చెంబూర్‌లో పెరిగాడు. 2000లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైరై, కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో కురువిళా, పది టెస్టులు, ఇరవై ఐదు వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు. అవన్నీ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఆడాడు. [3]
1997లో వెస్టిండీస్ పర్యటనలో జవగల్ శ్రీనాథ్ రోటేటర్ కఫ్ గాయంతో దూరమైనప్పుడు కురువిళా పేస్ బౌలింగుకు నాయకత్వం వహించాడు. ఆ పర్యటనలో అతని గణాంకాలు పరవాలేదుగా ఉన్నప్పటికీ, తదుపరి టెస్ట్ మ్యాచ్‌లలో చదునైన పిచ్‌లపై కూడా ఒక మాదిరి బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, అతన్ని జట్టు నుండి తొలగించారు. 2000 ఏప్రిల్‌లో రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ సమయంలో 31 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. "ఈ సీజన్ ప్రారంభంలోనే [రిటైర్ అవ్వాలని] నిర్ణయించుకున్నాను. చాలా మంది యువకులు వస్తున్నారు, వారికి చోటు కల్పించాలి అని తప్ప వేరే కారణమేమీ లేదు." అని అన్నాడు.[1]
2012 సెప్టెంబరు 27 న BCCI, కురువిళాను జాతీయ సెలెక్టర్‌గా నియమించింది.[4] ముంబై ఇండియన్స్ అతన్ని టాలెంట్ స్కౌట్‌గా నియమించుకుంది.[5]
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టులో ప్రవీణ్ తాంబే ఎంపిక కావడానికి ప్రధాన కారణం అతనే. 2020 డిసెంబరు 24 న కురువిళా భారత క్రికెట్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు. [6] [7] అతనికి 2009 నుండి DY పాటిల్ గ్రూప్‌తో అనుబంధం ఉంది. 2022 ఫిబ్రవరి 10 న కురువిళా బోర్డులో తన ఐదేళ్ల ఎంపిక కమిటీ పదవీకాలాన్ని పూర్తి చేసి, ఆ పదవిని విడిచిపెట్టాడు. [8]