అబ్దు రోజిక్ | |
---|---|
జననం | సవ్రికుల్ మహమ్మద్ రోజికి 2003 సెప్టెంబరు 23 గిష్దర్వా, పంజాకెంట్ జిల్లా, తజికిస్తాన్ |
జాతీయత | తజికిస్తాన్ |
క్రియాశీల సంవత్సరాలు | 2019 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రపంచంలోనే అత్యంత పొట్టి గాయకుడు |
గుర్తించదగిన సేవలు | హిందీ బిగ్ బాస్ సీజన్ 16 ఇంటి సభ్యుడు |
ఎత్తు | 3.1 అడుగులు |
అబ్దు రోజిక్ (ఆంగ్లం: Abdu Rozik; జననం 2003 సెప్టెంబరు 23) ఒక తజికిస్తాన్ దేశస్థుడు. అతను తజిక్ గాయకుడు, సంగీతకారుడు, బ్లాగర్, బాక్సర్. అతను ప్రపంచంలోనే అత్యంత పొట్టి గాయకుడిగా గుర్తింపు పొందాడు.[1] 2022 అక్టోబరులో ప్రారంభమైన హిందీ బిగ్ బాస్ సీజన్ 16లో ఇంటి సభ్యుడిగా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.[2] 19 ఏళ్ల అబ్దు రోజిక్ 3 అడుగుల ఒక అంగుళం ఎత్తు, 16 కిలోగ్రాముల బరువు ఉన్నాడు. తజిక్, పార్సీ భాషలు మాట్లాడే ఆయన రష్యన్ కూడా నేర్చుకుంటున్నాడు.
అబ్దు రోజిక్ తజికిస్తాన్‌లోని పంజాకెంట్ జిల్లా గిష్దర్వాలో సవ్రికుల్ మహమ్మద్ రోజికిగా జన్మించాడు. అతని తండ్రి సావ్రికుల్ ముహమ్మద్, తల్లి రూహ్ అఫ్జా. వీరు తోటమాలి వృత్తిలో జీవనం గడిపేవారు. అబ్దు రోజిక్‌కు ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. అతను 10వ తరగతి వరకు చదువుకున్నాడు. బాల్యంలో అతను రికెట్స్ అనే గ్రోత్ హార్మోన్ లోపంతో బాధ పడ్డాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆ వ్యాధికి తగిన వైద్య చికిత్స అందలేదు. దీని ఫలితంగా అతని శారీరక ఎదుగుదల కుంటుపడింది.
అబ్దు రోజిక్ చాలా చిన్న వయస్సులో గిష్దర్వా వీధుల్లో గాయకుడిగా మారాడు. 2019లో ఓహి దిలీ జోర్ (2019), చాకీ చకీ బోరాన్ (2020), మోదార్ (2021) వంటి వివిధ తజికిస్తానీ పాటలకు తన గాత్రాన్ని అందించాడు. చిన్న పిల్లాడిలా కనిపించే అబ్దు రోజిక్ బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ గా ప్రస్తుతం గూగుల్‌లో అత్యధిక ట్రెండ్‌లో ఉన్నాడు. తన మాతృభాష తజిక్ లో ర్యాప్ పాటలు పాడటంతో పాపులర్ అయిన అబ్దు రోజిక్ అవన్నీ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. “ఓహి దిలీ జోర్” అనే మ్యూజిక్ ఆల్బమ్ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుని మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ప్రపంచంలోనే పొట్టి గాయకుడిగా రికార్డుల్లోకెక్కిన అబ్దు రోజిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గాయకులతో వేదికలు పంచుకున్నాడు. గతంలో దుబాయిలో జరిగిన ఒక వేడుకలో సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌తో కలిసి కచేరీ చేశాడు.[3]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)