వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | అబ్దుల్ అజీమ్ |
పుట్టిన తేదీ | 1960 జూన్ 10 హైదరాబాదు, తెలంగాణ |
మరణించిన తేదీ | 2023 ఏప్రిల్ 18 హైదరాబాదు | (వయసు 62)
బ్యాటింగు | కుడిచేతి |
పాత్ర | బ్యాట్స్ మన్ |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1979/80-1994/95 | హైదరాబాదు క్రికెట్ జట్టు |
మూలం: క్కిక్ ఇన్ఫో, 2016 ఫిబ్రవరి 26, |
అబ్దుల్ అజీమ్ (1960 జూన్ 10 - 2023 ఏప్రిల్ 18) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1986 రంజీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన సౌత్ జోన్ తొలి బ్యాట్ మన్, భారత ఏడవ బ్యాట్ మన్. తన 15 సంవత్సరాల కెరీర్‌లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4000 పరుగులు చేశాడు.[1]
అజీమ్ 1960, జూన్ 10న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.
2014 సెప్టెంబర్‌లో అజీమ్‌ను హైదరాబాదు క్రికెట్ జట్టు కోచ్‌గా, నోయెల్ డేవిడ్ అజీమ్ సహాయకుడిగా, ఎన్.ఎస్. గణేష్ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు.[2] 2018 నవంబరులో హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ జూనియర్ సెలెక్షన్ ప్యానెల్ నుండి అజీమ్ వెళ్ళిపోయాడు.[3]
అజీమ్ 62 సంవత్సరాల వయస్సులో మూత్రపిండాల వైఫల్యంతో 18 ఏప్రిల్ 2023న మరణించాడు.[4] ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.