![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పాకిస్తాన్ | 1979 డిసెంబరు 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (183 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 157) | 1999 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2006 డిసెంబరు 1 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 111) | 1996 నవంబరు 1 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 నవంబరు 18 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 1) | 2006 ఆగస్టు 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2013 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996–2007 | Lahore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997–1999 | Khan Research Laboratories | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001–2002 | Pakistan International Airlines | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2003 | మిడిల్‌సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003–2004 | Zarai | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004– | Lahore Lions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2009 | హైదరాబాదు Heroes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | హాంప్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Sialkot Stallions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | లీసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | Melbourne Renegades | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2013 | Wayamba United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Lahore Qalandars | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 12 |
అబ్దుల్ రజాక్ (జననం 1979, డిసెంబరు 2) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా, కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1996లో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలోని తన సొంత మైదానంలో జింబాబ్వేతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు; ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 2009 గెలిచిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ స్క్వాడ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 265 వన్డేలు, 46 టెస్టులు ఆడాడు.
38 సంవత్సరాల వయస్సులో, 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాకిస్తాన్‌లో కోచ్‌గా కొద్దికాలం పనిచేశాడు.[2]
అబ్దుల్ రజాక్ మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన పంజాబ్‌లోని లాహోర్ శివార్లలోని షహదారా బాగ్‌లో జన్మించాడు.[3] ఇతనికి అయేషాతో వివాహం జరిగింది.[4] ఇతని కుమారుడు అలీ రజాక్ కూడా క్రికెటర్.[5]
అబ్దుల్ రజాక్ 1996 నవంబరులో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేయడానికి కేవలం మూడు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది.1999 నవంబరులో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడాడు. 1999-2000 కార్ల్టన్ అండ్ యునైటెడ్ సిరీస్‌లలో తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. భారత్‌తో హోబర్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఐదు వికెట్లు తీశాడు. అదే టోర్నమెంట్‌లో, ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బౌలింగ్ లోని ఒక ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టి, 20 పరుగులు చేశాడు.
అబ్దుల్ రజాక్ దేశీయ స్థాయిలో, ఖైబర్ పఖ్తున్ఖ్వాకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇతని ఆధ్వర్యంలో జట్టు 2020-21 సీజన్‌లో క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ, నేషనల్ టీ20 కప్, పాకిస్తాన్ కప్‌లను గెలుచుకుంది. తర్వాత 2021-22 దేశీయ సీజన్ కోసం సెంట్రల్ పంజాబ్‌కు ప్రధాన కోచ్ అయ్యాడు.[6]
మిస్బా-ఉల్-హక్, వకార్ యూనిస్ కోచ్‌ల నుండి వైదొలిగిన తర్వాత, 2021 న్యూజిలాండ్ టూర్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2021 సెప్టెంబరు 6న సక్లైన్ ముస్తాక్‌తో పాటు పాకిస్తాన్ జాతీయ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.[7]
Abdul Razzaq, from Shahedra on the outskirts of Lahore […]
Former Pakistan all-rounder Abdul Razzaq, who led Khyber Pakhtunkhwa to win Quaid-e-Azam Trophy, National T20 Cup and Pakistan Cup in the 2020-21 season, has been tasked with leading the coaching staff of Central Punjab's First XI [...]