అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ 2013, ఆగస్టు 3న విడుదలైన తెలుగుచలనచిత్రం.[1][2] లక్ష్మణ్ క్యాదరి నిర్మాణ సారధ్యంలో కోనేటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా నటించారు.[3][4]
శ్రీ (వరుణ్ సందేశ్) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బామ్మ (శ్రీలక్ష్మి) దగ్గర పెరుగుతుంటాడు. చిన్నప్పటి నుండి అమ్మాయిలకు దూరంగా పెరగడం వల్ల శ్రీకి అమ్మాయిలంటే భయంగా ఉంటుంది. ఐటి కంపెనీకి ఓనర్ అయిన శ్రీకి అంజలి ప్రపోజ్ చేస్తుంది. నష్టాల్లో ఉన్న తన కంపెనీ కాపాడుకోవడంకోసం అంజలితో పెళ్ళికి, ఆమె తండ్రి అంజలి గ్రూప్ కంపెనీస్ ఎండి కేకే (ఆహుతి ప్రసాద్) పెట్టిన డీల్ కి ఒప్పుకుంటాడు. అమ్మాయిలంటే భయంపోవడం కోసం వేశ్య అయిన నీరు (హరి ప్రియ)తో కాంట్రాక్టు మాట్లాడుకుంటాడు. దాస్ (కాశీ విశ్వనాథ్) అనే వ్యక్తి నీరుని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. దాస్ నీరుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, శ్రీ అంజలి పెళ్లి చేసుకున్నారా అన్నది మిగతా కథ.[5]