అభిజీత్ సావంత్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | ముంబై, మహారాష్ట్ర, భారత దేశము | 1981 అక్టోబరు 7
సంగీత శైలి | పాప్ |
వృత్తి | గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత |
క్రియాశీల కాలం | 2005–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శిల్పా ఎడ్వాంకర్ సావంత్ |
అభిజీత్ సావంత్ (మరాఠీ: अभिजीत सावंत) (జననం 1981 అక్టోబరు 7) భారతీయ ప్లేబాక్ గాయకుడు, టెలివిజన్ యాంకర్, ఇండియన్ ఐడల్ (తొలి సీజన్) విజేత. క్లినిక్ ఆల్ క్లియర్ - జో జీతా వోహీ సూపర్‌స్టార్‌లో మొదటి రన్నరప్ స్థానంలోనూ, ఆసియన్ ఐడల్‌లో మూడవ స్థానంలో నిలిచాడు.
1981 అక్టోబరు 7న ముంబైలోని షాహునగర్ జిల్లాలో సావంత్ పుట్టాడు. చేతనా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నాడు. మొదటి నుంచీ అతనికి సంగీతం పట్ల అభిరుచి ఉండేది. గ్రాడ్యుయేషన్ తర్వాత సంగీత పరిశ్రమలో కృషిచేయసాగాడు.[1]
గాయకునిగా అభిజిత్ సావంత్ ఇండియన్ ఐడల్ కారణంగా వెలుగులోకి వచ్చాడు. 2005 మార్చిలో అతను మొట్టమొదటి ఇండియన్ ఐడల్ పోటీలో విజేతగా నిలిచాడు. రూ.కోటి నగదు, ఒక హోండా సిటీ కార్‌తో పాటుగా "ఆప్ కా అభిజీత్" పేరిట ఒక మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించే కాంట్రాక్టును కూడా దక్కించుకున్నాడు.[2] 2005లో విడుదలైన ఈ ఆల్బమ్ వెనువెంటనే మంచి హిట్ అయింది. ఆల్బంలో భాగమైన "మొహబ్బతే లూటావూంగా", "లఫ్జో మే కెహనా", "క్యా తుఝే పతాహై" వంటి పాటలు చాలా విజయవంతమయ్యాయి.[3] దీని తర్వాత జానూన్ అన్న మరో మ్యూజిక్ ఆల్బమ్ చేశాడు.[2]
2007లో ఆసియన్ ఐడల్ అన్న షోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[4] దీనిలో మూడవ స్థానాన్ని పొందాడు. 2008లో జో జీతా వోహీ సూపర్‌స్టార్ అన్న షోలో పాల్గొని రెండవ స్థానాన్ని సంపాదించాడు.[5] 2005లో ఇండియన్ ఐడల్ గా విజయం సాధించగానే ఆషిక్ బనాయా ఆప్నే సినిమాలో పాటలు పాడాడు. ఇవి మంచి విజయాన్నే సంపాదించాయి.[6] ఆ తర్వాత అతను సినిమాల్లో ప్లేబాక్ సింగర్ గా కొద్ది పాటలే పాడాడు.
2013లో ఫరీదా, 2018లో ఫకీరా అన్న రెండు సూఫీ థీమ్‌తో రూపొందించిన ఆల్బమ్స్ చేశాడు.[7][8]
2009లో లాటరీ అన్న బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించాడు.[2] అయితే అది ఫ్లాప్ గా నిలిచింది. తీస్మార్ ఖాన్ సినిమాలోనూ చిన్న పాత్ర పోషించాడు. 2010లో "ఇండియన్ ఐడల్-5" సీజన్‌కి కో-హోస్ట్‌గా యాంకరింగ్ చేశాడు.[6]
{{cite web}}
: |first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)