అభిషేక్ జైన్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | విస్లింగ్ వుడ్స్ |
వృత్తి | దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుం |
సినీమ్యాన్ ప్రొడక్షన్స్ | |
గుర్తించదగిన సేవలు | కెవి రైట్ జైష్ బే యార్ రాంగ్ సైడ్ రాజు |
బంధువులు | నయన్ జైన్ (సోదరుడు) |
అభిషేక్ జైన్ గుజరాత్ కు చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత. కెవి రైట్ జైష్, బే యార్, రాంగ్ సైడ్ రాజు వంటి ప్రసిద్ధి చెందిన గుజరాతీ సినిమాలు తీసిన అభిషేక్, 2021లో హమ్ దో హమారే దో అనే సినిమాతో హిందీ సినిమారంగంలోకి అరంగేట్రం చేసాడు.
అభిషేక్ జైన్ 1986, ఆగస్టు 3న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని మార్వాడీ జైన కుటుంబంలో జన్మించాడు.[1] బికె మజుందార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి బిబిఏ డిగ్రీని పొందాడు. 2006లో అహ్మదాబాద్ విశ్వవిద్యాలయంలో భాగమయ్యాడు, 2008లో విస్లింగ్ వుడ్స్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో పట్టా పొందాడు.
విస్లింగ్ వుడ్స్‌లో కోర్సు పూర్తి చేసి, సంజయ్ లీలా భన్సాలీ, సుభాష్ ఘయ్ తీసిన గుజారిష్, సావరియా, యువరాజ్ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత, జైన్ రేడియో మిర్చిలో రేడియో జాకీగా పని చేయడం ప్రారంభించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మిఖిల్ ముసలే, అనీష్ షా తదితరులను అభిషేక్ కలిశాడు. వారంతా కలిసి 2010లో సినీమ్యాన్ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు.[2] కెవి రైట్ జైష్ అనే మొదటి సినిమాను గుజరాతీ భాషలో చేసాడు.[3][4] కెవి రైట్ జైష్ విజయవంతమయింది. గుజరాతీ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా అతనికి ట్రెండ్ సెట్టర్ అవార్డు కూడా లభించింది.[5] ఆ తర్వాత బే యార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందకోవడంతోపాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.[6] 2016, ఫిబ్రవరిలో అభిషేక్ జైన్, సినీమ్యాన్ ప్రొడక్షన్స్ మూడు గుజరాతీ చిత్రాలను ఫాంటమ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తుందని, వాటిలో ఒకదానికి అభిషేక్ స్వయంగా దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు.[7] సినీమ్యాన్ ప్రొడక్షన్స్, ఫాంటమ్ ఫిల్మ్‌ల సంయుక్త బ్యానర్‌పై విడుదలైన మొదటి సినిమా రాంగ్ సైడ్ రాజుకు, సినీమ్యాన్ ప్రొడక్షన్స్ సహ వ్యవస్థాపకుడు మిఖిల్ ముసలే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో గుజరాతీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
2019 ఏప్రిల్ లో హిట్ కన్నడ సినిమా కిరిక్ పార్టీకి హిందీ రీమేక్ చేయడానికి ముందుకు వచ్చాడు, కానీ తరువాత ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. 2021లో హమ్ దో హమారే దో అనే హిందీ కామెడీ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[8]
సంవత్సరం | సినిమా | దర్శకుడు | నిర్మాత | రచయిత | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
2012 | కెవి రైట్ జైష్ | Yes | Yes | Yes | గుజరాతీ | |
2014 | బే యార్ | Yes | Yes | గుజరాతీ | ||
2016 | రాంగ్ సైడ్ రాజు | Yes | గుజరాతీ | |||
2021 | హమ్ దో హమారే దో | Yes | story | హిందీ | డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది[8] |
సంవత్సరం | సినిమా |
---|---|
2007 | సావరియా |
2008 | యువరాజ్ |
2010 | గుజారిష్ |
సంవత్సరం | సిరీస్ | సీజన్ | దర్శకుడు | నిర్మాత | భాష | నెట్‌వర్క్/ప్లాట్‌ఫారమ్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|---|
2021 | విఠల్ టీడీ | 1 | Yes | Yes | గుజరాతీ | ఓహో గుజరాతీ | వెబ్ సిరీస్ |
2021 | రివర్ ఫ్రంట్ కథలు | 1 | Yes | Yes | గుజరాతీ | ఓహో గుజరాతీ | ఎపిసోడ్: వాత్ రాత్ మాన్ |
2022 | మిస్సింగ్ | 1 | Yes | Yes | గుజరాతీ | ఓహో గుజరాతీ | వెబ్ సిరీస్ |
2015 జూన్ లో ఆ తో జస్ట్ వాట్ ఛే... అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది తన మొదటి రెండు పట్టణ గుజరాతీ సినిమాలను తీస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలపై రాసిన పుస్తకం.
సినిమా | అవార్డులు | వర్గం |
---|---|---|
కెవి రైట్ జైష్ | 2012 బిగ్ గుజరాతీ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు[9] |
12వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు[10] | |
ఉత్తమ కథ | ||
బే యార్ | 14వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు[11] |
రాంగ్ సైడ్ రాజు | 14వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డులు | ఉత్తమ చిత్రం |