వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అభిషేక్ మోహన్ నాయర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సికింద్రాబాదు, హైదరాబాదు, తెలంగాణ | 1983 అక్టోబరు 8|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 178) | 2009 జూలై 3 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 సెప్టెంబరు 30 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2018 | ముంబై క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | పూణే వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | రాజస్తాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | పాండిచెరి క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2018 డిసెంబరు 9 |
అభిషేక్ మోహన్ నాయర్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్ గా ముంబై తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్, పూణే వారియర్స్ ఇండియా, రాజస్థాన్ రాయల్స్ జట్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 2018 నవంబరులో తన 100వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.
అభిషేక్ 1983, అక్టోబరు 8న మోహన్ నాయర్ - లేఖా నాయర్ దంపతులకు తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించాడు.
అభిషేక్ కుడిచేతి మీడియం-పేసర్. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో ముంబై జట్టుకు కీలకంగా నిలిచాడు. ఎడమ చేతి బ్యాటింగ్‌తో క్రీజ్ ఆక్యుపేషన్‌తోపాటు బంతిని బలంగా కొట్టే సామర్థ్యం ఉన్న నాయర్ 2006లో రంజీ ట్రోఫీలో ముంబై గెలిచిన కీలకపాత్ర పోషించాడు. 2006లో గుజరాత్‌పై 97 పరుగులు, మహ్మద్ నిస్సార్ ట్రోఫీలో కరాచీ అర్బన్‌పై 152 పరుగులు చేశాడు. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఫ్రాంచైజీ అభిషేక్ ను కొనుగోలు చేసింది. 2008/09 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో కీలకమైన 99 పరుగులు చేసి, ముంబై 38వ విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డాడు.
2012/13 రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై తరపున మూడు సెంచరీలు, ఎనిమిది 50 లతోసహా 966 పరుగులు చేశాడు. 40వ రంజీ ట్రోఫీ టైటిల్‌లో ముఖ్యమైన పాత్ర పోషించి 19 వికెట్లు కూడా తీశాడు. ఫిబ్రవరిలో జరిగిన టూర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఎ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. 2013లో ఇంటర్-జోన్ దేవధర్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో 17 బంతుల ఓవర్‌లో 10 వైడ్‌లు, ఒక నో-బాల్‌ను వేశాడు.
2013 సెప్టెంబరులో చివరి రోజున విశాఖపట్నంలో న్యూజిలాండ్ "ఎ"తో జరిగిన మ్యాచ్‌లో విజయ్ జోల్‌తో పాటు అతను సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ డ్రాగా నిలిచింది. 2013 ఛాలెంజర్ ట్రోఫీలో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇండియా రెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో అజేయంగా 75 పరుగులు చేశాడు. 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ తర్వాత, ఆఫ్-సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మెంటర్, హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.[1] 2018-19 రంజీ ట్రోఫీకి ముందు, ముంబై నుండి పుదుచ్చేరికి వచ్చాడు.[2] 2018 నవంబరులో తన 100వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఆడాడు.[3]
వెస్టిండీస్‌లో జరిగిన వన్డే టోర్నీ పర్యటన కోసం భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అందులోని మూడు మ్యాచ్‌లలో, ఒక ఇన్నింగ్స్‌లో ఆడాడు. ఏడు బంతులు అడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు, దాదాపు బౌల్డ్ అయ్యాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి, వికెట్లు తీయకుండా 17 పరుగులు ఇచ్చాడు.[4]
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు.
అభిషేక్‌కు 2014లో నటాషా షేక్‌తో వివాహం జరిగింది.
{{cite news}}
: Check date values in: |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)