అమలానంద ఘోష్ | |
---|---|
జననం | వారణాసి, బ్రిటిషు భారతదేశం | 1910 మార్చి 3
మరణం | 1981 (aged 70–71) |
జాతీయత | భారతీయుడు |
ప్రసిద్ధి | భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ మాజీ డైరెక్టరు జనరల్ |
అమలానంద ఘోష్ (1910 మార్చి 3 - 1981) భారతీయ పురాతత్వ శాస్త్రవేత్త. భారతదేశపు ప్రాచీన నాగరికతలపై అనేక రచనలు చేసిన రచయిత, సంపాదకుడు. 1900 లలో పురాతత్వ పరిశోధనల నిర్వాహకుడు, డైరెక్టరు.
ఘోష్ 1910 మార్చి 3 న వారణాసిలో జన్మించాడు. వారణాసి, అలహాబాద్‌లలో విద్యాభ్యాసం చేసిన ఆయన తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీలో ఉన్నత శిక్షణ పొందాడు.[1][2]
ఘోష్ 1937 లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చేరాడు. చివరికి దాని డైరెక్టర్ జనరల్‌గా ఎదిగాడు. 1953 నుండి 1968 వరకు ఆ పదవిలో పనిచేశాడు.[3]
సర్వేలో ఉన్న కాలంలో, ఘోష్ పచ్‌మరి, బికనీర్, [4] బ్రహ్మగిరి, మస్కీ, తక్షిలా, అరికమేడు, హరప్పా వద్ద పరిశోధనలతో సహా అనేక త్రవ్వకాల్లో పాల్గొన్నాడు, నాయకత్వం వహించాడు. 1950 లో ఘోష్, పురాతన సరస్వతీ నది ఎండిపోయిన పడక వెంబడి బికనీర్ సైట్‌లో ఒక క్రమబద్ధమైన అన్వేషణను నిర్వహించి ప్రారంభించాడు. కొన్ని నెలల్లో, అతని కృషి వలన 100 కంటే ఎక్కువ ప్రదేశాలను వెలికితీసింది, వీటిలో 25 [5] హరప్పా, మొహెంజొదారోలో లభించిన పురాతన వస్తువులను పోలి ఉన్నాయి.[4]
ఆయన డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో 1961 లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శతాబ్ది ఉత్సవం జరిగింది.
సర్వేలో అతని పదవీకాలం తరువాత ఘోష్, ఖతార్ (1968), బహ్రెయిన్ (1968), సౌదీ అరేబియా (1968–69), యెమెన్ (1970) ప్రభుత్వాలకు పురాతత్వ శాస్త్రంపై యునెస్కో సలహాదారుగా వ్యవహరించారు. అతను 1968 నుండి 1971 వరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఫెలోగా ఉన్నాడు.[2]
ఘోష్ తన కెరీర్‌లో అనేక పుస్తకాలు, వ్యాసాలను రచించాడు. ఇందులో ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ,[6] అనేది భారతదేశంలో సంవత్సరాల తరబడి నిర్వహించిన పురాతత్వ కృషిపై సమగ్ర రిఫరెన్సు పుస్తకం. ఇతర రచనలలో ఎ సర్వే ఆఫ్ ది రీసెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎర్లీ ఇండియన్ ఆర్కియాలజీ,[7] ది సిటీ ఇన్ ఎర్లీ హిస్టారికల్ ఇండియా,[8] ఎ గైడ్ టు నలందా ఉన్నాయి.[9]
అతని భార్య సుధా ఘోష్. వారికి సుపర్ణ ఘోష్, అసిమ్ ఘోష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను లండన్ లోని రాయల్ ఇండియా, పాకిస్తాన్ అండ్ సిలోన్ సొసైటీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు; లండన్ లోని సొసైటీ ఆఫ్ యాంటీక్వేరీస్, లో గౌరవ సభ్యుడు. బెర్లిన్‌లోని డ్యుచెస్ ఆర్కియాలజీస్ ఇన్‌స్టిట్యూట్‌కు గౌరవ ఫెలో. అతను 1962 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[2]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) accessed 24 Aug. 2011