అమిత్ జోగి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2013 – 2018 | |||
నియోజకవర్గం | మార్వాహి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] డల్లాస్, టెక్సస్, అమెరికా | 7 ఆగస్టు 1977||
జాతీయత | అమెరికన్ (till 2002) భారతీయుడు(2002–ప్రస్తుతం) | ||
రాజకీయ పార్టీ | జనతా కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | అజిత్ జోగి (తండ్రి)[2] డా. రేణు జోగి (తల్లి)[3] | ||
జీవిత భాగస్వామి | రిచా జోగి |
అమిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.[4]
అమిత్ జోగి తన తండ్రి ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో మార్వాహి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సమీరా పైక్రా పై 46250 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఆయనను 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.[5]
అమిత్ జోగి తన తండ్రి అజిత్ జోగి మరణాంతరం 2020లో మార్వాహీ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయడం కోసం నామినేషన్ వేయగా ఆయన సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని నామినేషన్‌ను తిరస్కరించారు.[6]