వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అమీ ఎల్లా సాటర్త్‌వైట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్ | 1986 అక్టోబరు 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం; కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | లీ తహుహు (భార్య) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 106) | 2007 21 July - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 26 March - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 18) | 2007 19 July - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 9 September - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04–2022/23 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2015/16 | Tasmania | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16–2016/17 | Hobart Hurricanes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2018 | Lancashire Thunder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18–2018/19 | Melbourne Renegades | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | Tasmania | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020/21 | Melbourne Renegades | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Manchester Originals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 6 March 2023 |
అమీ ఎల్లా సాటర్త్‌వైట్ (జననం 1986, అక్టోబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా ఎడమచేతి వాటం బ్యాటింగ్ లో, కుడిచేతి మీడియం లేదా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో రాణించాడు. 2007 - 2022 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 145 వన్ డే ఇంటర్నేషనల్స్, 111 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ, టాస్మానియా, హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, లంకాషైర్ థండర్, లాంక్షైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1]
2017, ఫిబ్రవరి 26న, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో, మహిళా వన్డేలలో మొదటి క్రీడాకారిణిగా, వన్డేలలో కుమార సంగక్కర తర్వాత వరుసగా నాలుగు సెంచరీలు సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది.[2] 2017 డిసెంబరులో, ప్రారంభ ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[3][4] 2018 సెప్టెంబరులో, సుజీ బేట్స్ న్యూజీలాండ్ కెప్టెన్సీ నుండి వైదొలగడంతో, ఆ స్థానంలో సాటర్త్‌వైట్ ఎంపికయింది.[5]
2020 జూలైలో, న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్‌గా సాటర్త్‌వైట్ నియమితురాలయింద, సోఫీ డివైన్ పూర్తి సమయం ఆధారంగా జట్టు కెప్టెన్‌గా నియమితురాలయింది. 2020 సెప్టెంబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన న్యూజీలాండ్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, సాటర్త్‌వైట్ తన 100వ మహిళా టీ20లో ఆడింది. 2022 మే లో, సాటర్త్‌వైట్ అంతర్జాతీయ క్రికెట్ నుండి, 2023 ఫిబ్రవరిలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించింది.
సాటర్త్‌వైట్ 2007, జూలై 19న ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. రెండు రోజుల తర్వాత ఆస్ట్రేలియాపై తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[6]
అమీ సాటర్త్‌వైట్ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు[7] | ||||||
---|---|---|---|---|---|---|
# | పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థులు | నగర దేశం | వేదిక | సంవత్సరం |
1 | 109 | 47 | ఆస్ట్రేలియా | సిడ్నీ, ఆస్ట్రేలియా | ఉత్తర సిడ్నీ ఓవల్ | 2012[8] |
2 | 103 | 54 | ఇంగ్లాండు | ముంబై, భారతదేశం | బ్రబౌర్న్ స్టేడియం | 2013[9] |
3 | 137 * | 89 | పాకిస్తాన్ | లింకన్, న్యూజిలాండ్ | బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ | 2016[10] |
4 | 115* | 90 | పాకిస్తాన్ | లింకన్, న్యూజిలాండ్ | బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ | 2016[11] |
5 | 123 | 92 | పాకిస్తాన్ | నెల్సన్, న్యూజిలాండ్ | సాక్స్టన్ ఓవల్ | 2016[12] |
6 | 102* | 93 | ఆస్ట్రేలియా | ఆక్లాండ్, న్యూజిలాండ్ | ఈడెన్ పార్క్ ఔటర్ ఓవల్ | 2017[13] |
7 | 119* | 125 | ఇంగ్లాండు | డునెడిన్, న్యూజిలాండ్ | యూనివర్శిటీ ఓవల్ | 2021[14] |
2017 మార్చిలో, తన తోటి అంతర్జాతీయ క్రికెటర్ లీ తహుహుని వివాహం చేసుకుంది.[15] 2020 జనవరి 13న, సాటర్త్‌వైట్ గ్రేస్ మేరీ సాటర్త్‌వైట్ అనే కుమార్తెకు జన్మనిచ్చింది.[16]