అమ్మాయే నవ్వితే | |
---|---|
దర్శకత్వం | వి.జ్యోతికుమార్ |
రచన | జలదంకి సుధాకర్ (చిత్రానువాదం/మాటలు) |
కథ | ఉదయ్ రాజ్ |
నిర్మాత | వి. ఆనంద్ ప్రసాద్ |
తారాగణం | రాజేంద్రప్రసాద్, భావన, జయసుధ, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | ఎన్.వి. సురేష్ కుమార్ |
కూర్పు | మురళి-రామ్మయ్య |
సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్[1] |
విడుదల తేదీ | 9 నవంబరు 2001 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమ్మాయే నవ్వితే 2001, నవంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్[2] పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి.జ్యోతికుమార్[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, భావన, జయసుధ, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అదించారు.[4] ఈ చిత్రం పరాజయం పొందింది.[5]
భూస్వామ్య యుగ అధిపతి శేషాద్రి నాయుడు (రంగనాథ్) పాలించిన తలమంచి గ్రామంలోని సుందరం (రాజేంద్ర ప్రసాద్) ఒక నిరుద్యోగి. నాయుడు కళాశాలలో హిందీ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో సుందరం ఆ ఉద్యోగంలో చేరాలి అనుకుంటాడు. తన తెలివితేటలతో సుందరం ఆ ఉద్యోగం పొందుతాడు. నాయుడు కుమార్తైన శిరీష (భవన)ను ప్రేమిస్తాడు. ఇది గమనించిన నాయుడు, 15 రోజుల్లో శిరీషతో ఐ లవ్ యు చెప్పించుకోవాలని షరతు విధిస్తాడు. శిరిష ప్రేమను పొందడంలో సుందరం విజయవంతమవుతాడ అనేది మిగిలిన కథ.
అమ్మాయే నవ్వితే | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 2001 | |||
Genre | పాటలు | |||
Length | 23:42 | |||
Label | టిప్స్ మ్యూజిక్ | |||
Producer | ఎం.ఎం. శ్రీలేఖ | |||
ఎం.ఎం. శ్రీలేఖ chronology | ||||
|
ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. టిప్స్ మ్యూజిక్ కంపనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కొక్కొ కోడిపెట్ట (రచన: శ్వేతనాగ)" | శ్వేతనాగ | హరిణి | 4:08 |
2. | "నిన్న లేదు మొన్న లేదు (రచన: కులశేఖర్)" | కులశేఖర్ | రమణ, ఎం.ఎం. శ్రీలేఖ | 4:26 |
3. | "ఎబిసిడి (రచన: శ్వేతనాగ)" | శ్వేతనాగ | రవివర్మ పోతేదార్, ఎం.ఎం. శ్రీలేఖ | 4:05 |
4. | "చిన్ని కృష్ణుడొచ్చాడు (రచన: జలదంకి సుధాకర్)" | జలదంకి సుధాకర్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్, రమణ, సునీత ఉపద్రష్ట | 3:22 |
5. | "యమునాతీరే యమయమ (రచన: శ్వేతనాగ)" | శ్వేతనాగ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. శ్రీలేఖ | 3:18 |
6. | "దండాలయ్య (రచన: జలదంకి సుధాకర్)" | జలదంకి సుధాకర్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:23 |