అమ్మోరు తల్లి | |
---|---|
దర్శకత్వం |
|
రచన | ఆర్జే బాలాజీ |
నిర్మాత | ఐసరి కె.గణేష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | దినేష్ కృష్ణన్.బి |
కూర్పు | ఆర్.కె. సెల్వ |
సంగీతం | గిరీష్ గోపాలకృష్ణన్ |
నిర్మాణ సంస్థ | వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 14 నవంబరు 2020 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమ్మోరు తల్లి 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’గా విడుదలైన ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్.జె.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14, 2020న డిస్నీ+ హాట్‌స్టార్లో విడుదలైంది.[1] నయనతార, ఆర్జే బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మధు, అభినయ, అజయ్ ఘోష్, తిరునవక్కరసు, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు.[2]
కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్‌గా పని చేస్తున్న ఏంగెల్స్ రామస్వామి (ఆర్.జె.బాలాజీ) అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళతో కలిసి జీవిస్తుంటాడు. రామస్వామి భాద్యతలు చూసి తనకి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. తమ కష్టాలను తీర్చమని తమ కులదైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే, నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు (నయనతార) వారికి ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారిపోయింది? అసలు అమ్మవారు ఎందుకు ఈ భూమ్మీదకు వచ్చారు? నిజంగా ఆమె అమ్మవారేనా? అనేదే మిగతా సినిమా కథ.[3][4]