ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో విస్తరించివుంది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.[1] పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉంది.[2] అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలలో 6 ఎస్టీలకీ, 1 ఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.
2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య, [6] ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం, [7] కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పోటీచేశారు.[8] ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.