అరవింద్ కుమార్ శర్మ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | జగ్బీర్ సింగ్ మాలిక్ | ||
నియోజకవర్గం | గోహనా | ||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | దీపేందర్ సింగ్ హుడా | ||
తరువాత | దీపేందర్ సింగ్ హుడా | ||
నియోజకవర్గం | రోహ్తక్ | ||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | ఈశ్వర్ దయాళ్ స్వామి | ||
తరువాత | అశ్విని కుమార్ చోప్రా | ||
నియోజకవర్గం | కర్నాల్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | ధరమ్ పాల్ సింగ్ మాలిక్ | ||
తరువాత | కిషన్ సింగ్ సాంగ్వాన్ | ||
నియోజకవర్గం | సోనిపట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మజ్రా , పంజాబ్ , భారతదేశం | 1962 నవంబరు 25||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2014–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | *భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | రీటా శర్మ (m. 1989) | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (డెంటల్ డిగ్రీ) మహర్షి దయానంద్ యూనివర్సిటీ (ఎండీఎస్) | ||
మూలం | [1] |
అరవింద్ కుమార్ శర్మ (జననం 25 నవంబర్ 1962) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికై,[1] 2024 శాసనసభ ఎన్నికలలో గోహనా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో మంత్రి భాద్యతలు చేపట్టాడు.[3]
అరవింద్ కుమార్ శర్మ 1996లో సోనెపట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సోషల్ యాక్షన్ పార్టీ (SAP) అభ్యర్థి రిజాక్ రామ్‌పై 49,540 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో రోహ్‌తక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 27,265 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
అరవింద్ కుమార్ శర్మ ఆ తరువాత కాంగ్రెస్‌లో 2004లో కర్నాల్ నుండి పోటీ చేసి బీజేపీకి అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామిపై 1.64 లక్షల ఓట్లతో, 2009లో తిరిగి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చోప్రా చేతిలో ఓడిపోయాడు. అరవింద్ శర్మ 2014లో హర్యానా శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను విడి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బీఎస్‌పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యమునానగర్, జులనా నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
అరవింద్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019 మార్చి 16న భారతీయ జనతా పార్టీలో చేరి,[4] 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తిరిగి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి,[5] 2024 హర్యానా శాసనసభ ఎన్నికలలో గోహనా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో మంత్రి భాద్యతలు చేపట్టాడు.[6]
సంవత్సరం | ఎన్నిక | పార్టీ | నియోజకవర్గం | ఫలితం | |
---|---|---|---|---|---|
1996 | 11వ లోక్‌సభ | స్వతంత్ర | సోనిపట్ | గెలుపు | |
1998 | 12వ లోక్‌సభ | శివసేన | ఓటమి | ||
2004 | 14వ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | కర్నాల్ | గెలుపు | |
2009 | 15వ లోక్‌సభ | గెలుపు | |||
2014 | 16వ లోక్‌సభ | ఓటమి | |||
2014 | 13వ హర్యానా అసెంబ్లీ | బహుజన్ సమాజ్ పార్టీ | జులనా | ఓటమి | |
యమునానగర్ | ఓటమి | ||||
2019[7] | 17వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | రోహ్తక్ | గెలుపు | |
2024 | 18వ లోక్‌సభ | ఓటమి | |||
2024[8] | 15వ హర్యానా అసెంబ్లీ | గోహనా | గెలుపు |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)