అరుంధతి దేవి | |
---|---|
జననం | |
మరణం | 1990 జనవరి 1కలకత్తా, పశ్చిమ బెంగాల్ | (వయసు 65)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమా నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని[1] |
క్రియాశీల సంవత్సరాలు | 1940-1982 |
గుర్తించదగిన సేవలు | బిచారక్, జతుగృహ |
జీవిత భాగస్వామి | ప్రభాత్ ముఖోపాధ్యాయ్ (1955) తపన్ సింహ (1957) |
పిల్లలు | అనింద్య సిన్హా |
అరుంధతి దేవి, (1924 - 1990) బెంగాలీ సినిమా నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని.[2]
అరుంధతి బ్రిటీష్ ఇండియాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్) బెంగాల్ ప్రెసిడెన్సీలోని బారిసాల్‌లో జన్మించింది.
విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ఉన్న అరుంధతి, శైలజరంజన్ మజుందార్ వద్ద రబీంద్ర సంగీత్ లో శిక్షణ తీసుకుంది. 1940లో ఆల్ ఇండియా రేడియోలో రవీంద్ర సంగీత గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది.[3]
కార్తీక్ ఛటోపాధ్యాయ 1952లో తీసిన మహాప్రస్థానేర్ పతే అనే బెంగాలీ సినిమాలో అరుంధతీ దేవి తొలిసారిగా నటించింది. ఈ సినిమా యాత్రిక్ పేరుతో హిందీలో విడుదలయింది.[4] దేవకీ కుమార్ బోస్ తీసిన నబజన్మ (1956), అసిత్ సేన్ తీసిన చలాచల్ (1956), పంచతప (1957), ప్రభాత్ ముఖోపాధ్యాయ్ తీసిన మా (1956), మమత (1957), బిచారక్ (1959), ఆకాశపతల్ (1960), తపన్ సిన్హా తీసిన కలమతి (1958), జిందర్ బోండి (1961), జతుగృహ (1964) మొదలైన సినిమాలలో నటించింది. 1963లో బిజోయ్ బోస్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గెలుచుకున్న బెంగాలీ చిత్రం భాగినీ నివేదిత (1962)లో నటించి ఉత్తమ నటిగా బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్లు అవార్డును అందుకుంది. 1967లో, అరుంధతి తొలిసారి దర్శకత్వం వహించిన చుట్టి సినిమాకు 14వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉన్నత సాహిత్య రచన ఆధారంగా ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.
దర్శకుడు ప్రభాత్ ముఖర్జీతో 1955లో అరుంధతి వివాహం జరిగింది. 1957లో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా దర్శకుడు తపన్ సిన్హాను కలుసుకున్న అరుంధతి, అతనిని వివాహం చేసుకుంది. వీరి కుమారుడు శాస్త్రవేత్త అనింద్య సిన్హా.
అరుంధతి 1990, జనవరి 1న మరణించింది. [6]