అరుణాచలం | |
---|---|
దర్శకత్వం | సుందర్.సీ |
రచన |
|
స్క్రీన్ ప్లే | సుందర్.సీ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | యు. కె. సెంథిల్ కుమార్ |
కూర్పు | పి. సాయి సురేష్ |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | అన్నామలై సినీ కంబైన్స్ |
విడుదల తేదీ | 10 ఏప్రిల్ 1997 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
అరుణాచలం సుందర్.సీ దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఒక విజయవంతమైన తమిళ అనువాద చిత్రం. రజనీకాంత్, సౌందర్య ఇందులో ప్రధాన పాత్ర ధారులు. ఇతర ముఖ్య పాత్రల్లో రంభ, రఘువరన్, విసు, గౌండమణి, సెంథిల్, వడివుక్కరసు తదితరులు నటించారు. దేవా సంగీతాన్నందించాడు.
ఏప్రిల్ 1997 లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి అనుకూల సమీక్షలు అందుకుని ఉత్తమ చిత్రంతో పాటు మూడు తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు కైవసం చేసుకుంది.[1]
అరుణాచలం (రజనీకాంత్) గ్రామ పెద్దగా గౌరవించబడే పట్టాభి (రవిచంద్రన్) కొడుకు. పట్టాభి చెల్లెలు సుభద్ర ప్రేమ వివాహం చేసుకున్నదన్న కారణంగా ఆమెను చాలా కాలంగా దూరంగా ఉంచుతారు. పట్టాభి కూతురు అరుంధతి పెళ్ళి జరుగుతుండటంతో సుభద్ర, భర్త తమ కూతురు వేదవతి (సౌందర్య) తో కలిసి పట్టాభి వాళ్ళ ఊరికి వస్తారు. అందరూ కలిసి అరుణాచలం పేరును కలవరిస్తుండటంతో వేదవతి అతన్ని చూసి ప్రేమలో పడుతుంది. అరుణాచలానికి, వేదవతికి పెళ్ళి చేస్తే వాళ్ళ కుటుంబాలు మళ్ళీ దగ్గరవుతాయని అందరూ అనుకుంటారు కానీ ఇంటికి పెద్దయిన వేదవతి (వడివుక్కరసి) మాత్రం అందుకు అంగీకరించదు. ఆమెకు అరుణాచలం అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు. ఎప్పుడూ అతనంటే ద్వేషం కనబరుస్తూ ఉంటుంది. ఆమె వేదవతి తండ్రి చంద్రశేఖరాన్ని పక్కకి పిలిచి రహస్యంగా అతని చెవిలో ఏదో చెబుతుంది. దాంతో అతను పెళ్ళి నిర్ణయాన్ని వాయిదా వేసుకుని అరుణాచలంతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతారు.
ఒకసారి అరుణాచలం తన రెండో తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని తెలుస్తుంది. కానీ అతను మాత్రం ఆమె తన స్థాయికి, వంశానికి తగదని భావించి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. అరుణాచలం కావాలంటే తన భాగం ఆస్తిని ఆ అమ్మాయికీ రాసిస్తాననీ ఆమెను పెళ్ళి చేసుకోమని చెబుతాడు. దాంతో వేదవతి ఆగ్రహానికి గురవుతుంది. ఆమె అరుణాచలం అసలు పట్టాభి కొడుకే కాడనీ, అతన్ని అరుణాచలేశ్వర గుడిలో వాళ్ళ అమ్మ జన్మనిచ్చి చనిపోతుంటే తీసుకు వచ్చి పెంచుకున్నారనీ చెబుతుంది. అతని మెడలో ఉండే రుద్రాక్ష తప్ప అతనికి ఆస్తిలో చిల్లగవ్వ కూడా లేదని చెబుతుంది. ఆమె సూటిపోటి మాటలు తట్టుకోలేక అరుణాచలం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు.
అరుణాచలం చెన్నై కి వచ్చి కిళ్ళీలు అమ్ముకునే కార్తవరాయుడిని (జనక్ రాజ్) ని కలుసుకుని చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. ఒకసారి వేదవతిని కలిసి ఆమె తన ఇంటికి రమ్మని పిలిస్తే అక్కడికి వెళతాడు. ఆమె తండ్రి అతన్ని అవమానించి ఇంట్లోంచి పంపేస్తాడు. అరుణాచలానికి నందిని (రంభ) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమె అరుణాచలానికి తన తండ్రి ఆఫీసుకు రమ్మంటుంది. సరిగా అప్పుడే నందిని తండ్రి రంగాచారి కంపెనీకి సంబంధించిన కొన్ని ఆస్తులు ఒక ట్రస్టుకు బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అప్పుడే అక్కడికి వెళ్ళిన అరుణాచలాన్ని చూసిన నందిని తండ్రి రంగాచారి (విసు) చూసి ఆశ్చర్యపోయి అతన్ని పిలిచి నిజానికి అతను తమ బాస్ అయిన వేదాచలం (రజనీకాంత్) కొడుకనీ, ఆ ఆస్తికంతటికీ అతనే వారసుడనీ చెబుతాడు.
అతనికి తండ్రి వీడియో ఒకటి చూపిస్తాడు. అందులో తన తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకుంటాడు. అలాగే తండ్రి ఆస్తిని రెండు మార్గాల్లో తీసుకోవచ్చని చెబుతాడు. ఒకటి 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టి 3000 కోట్ల సంపదకు వారసుడు కావడం, రెండు 30 కోట్లు తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోవడం. దానికి అరుణాచలం తనకు రెండూ అవసరం లేదనీ, ఆ వీడియో టేపు తనకిస్తే తనను అవమానించిన వారికి తన తల్లిదండ్రులెవరో గర్వంగా చెప్పుకుంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ అనుకోకుండా ఆ ట్రస్టు సభ్యులు మోసగాళ్ళని తెలిసి తిరిగి 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టే సవాలుకి ఒప్పుకుంటాడు.
అరుణాచలం అనేకరకాలుగా డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెడుతుంటాడు. దానిని అడ్డుకోవడానికి ట్రస్టు సభ్యులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అరుణాచలం తన కుటుంబ సభ్యులెవరో వేదవతి కుటుంబానికి తెలియడంతో వారు కూడా సంతోష పడుతారు. కానీ ఒకసారి వేదవతి కుటుంబానికి డబ్బు అవసరం కావడంతో ఆమె అరుణాచలాన్ని సహాయం అడుగుతుంది. కానీ చాలెంజిలో ఉన్న కొన్ని నియమాల వలన అతను సహాయం చేయలేనని చెబుతాడు. దాంతో వేదవతి అతనికి, నందినికీ సంబంధం అంటగట్టి అతన్ని అపార్థం చేసుకుంటుంది. అన్ని ఆటంకాలు దాటుకుని అరుణాచలం పరీక్షలో నెగ్గుతాడు. అప్పుడే ఆ మోసగాళ్ళైన ట్రస్టు సభ్యులు తిరగబడితే వాళ్ళకి బుద్ధి చెబుతాడు. అప్పుడే టీవీ చానల్లో అతని మాటలు చూసి అతన్ని అర్థం చేసుకున్న వేదవతి వచ్చి అరుణాచలంని కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
పాట | పాడిన వారు | రాసిన వారు |
---|---|---|
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా | మనో | |
మాట్లాడు మాట్లాడు మల్లిక | మనో, సుజాత | |
అలీ అలీ అనార్కలి | మనో,సౌమ్య | |
సింగన్న బైలుదేరెనే [2] | వందేమాతరం | |
నగుము ఆ సుగుము [2] | చిత్ర, కృష్ణంరాజు |
ఎవరు ఎవరు సొంతంరా, హరిహరన్, ఎ. ఎం రత్నం
3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.