అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ | |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ శాసనసభ |
కాల పరిమితులు | 2024-2029 |
నాయకత్వం | |
డిప్యూటీ స్పీకర్ | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
సభ ఉప నాయకుడు (ఉప ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష నాయకుడు | ఖాళీ |
నిర్మాణం | |
సీట్లు | 60 |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (59)
ప్రతిపక్షం (1) |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2024 ఏప్రిల్ 19 |
తదుపరి ఎన్నికలు | 2029 |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్ |
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ, ఈశాన్య భారతదేశం లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏకసభ రాష్ట్ర శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఇటానగర్ ఉంది.శాసనసభలో 60 మంది శాసనసభ సభ్యులు ఉంటారు. వీరు ఒకే స్థానంతో కూడిన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికవుతారు.[2]
1969 డిసెంబరు 29న, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్) పాలనకు అత్యున్నతసలహా సంస్థ అయిన ఏజెన్సీ కౌన్సిల్ ఉనికిలోకి వచ్చింది. అస్సాం గవర్నర్ దాని ఛైర్మన్‌గా ఉన్నారు.1972 అక్టోబరు 2న ఏజెన్సీ కౌన్సిల్ స్థానంలో ప్రదేశ్ కౌన్సిల్ ఏర్పడింది.1975 ఆగస్టు 15న ప్రదేశ్ కౌన్సిల్‌ను తాత్కాలిక శాసనసభగా మార్చారు. అప్పటి శాసనసభ ప్రారంభంలో 33 మంది సభ్యులు ఉండేవారు. వారిలో 30 మంది సభ్యులు నేరుగా ఒకే సీటుతో కూడిన నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు. ముగ్గురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడ్డారు. 1987 ఫిబ్రవరి 20న రాష్ట్ర హోదా పొందిన తరువాత, శాసనసభ సభ్యులు సంఖ్యను 60కి పెరిగింది [3]
అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత 11వ శాసనసభ ప్రిసైడింగ్ అధికారులు ఈ దిగువ ఇవ్వబడ్డాయి
హోదా | పేరు. |
---|---|
గవర్నరు | కైవల్య త్రివిక్రమ పర్నాయక్ |
స్పీకరు | తేసమ్ పొంగ్టే |
డిప్యూటీ స్పీకర్ | కర్డో నైగ్యోర్ |
సభ నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) | పెమా ఖండు |
ప్రతిపక్ష నేత | ఖాళీ |
ఆధారం[4]