అరూన్ టికేకర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | అరూన్ టికేకర్ 1944 ఫిబ్రవరి 1 |
మరణం | 2016 జనవరి 19 | (వయసు 71)
అరూన్ టికేకర్ (ఆంగ్లం: Aroon Tikekar) పలు వార్తా సంస్థల్లో సంపాదకుడిగా విధులు నిర్వర్తించిన సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త.
ఆయన రచయితల, జర్నలిస్టుల కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక కళాశాల అధ్యాపకునిగా కొన్ని సంవత్సరాలు పనిచేసి తరువాత న్యూఢిల్లీ లోని యు.ఎస్.లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద భాష, అసహిత్యం నిపుణునిగా ఆరితేరారు. ఆయన పత్రికా ప్రస్థానం "ది టైమ్స్ ఆఫ్ ఇండియా"కు ఛీఫ్ గా చేరినప్పుడు ప్రారంభమైనది. ఆయన మహారాష్ట్ర టైమ్స్ పత్రికకు సీనియర్ అసిస్టెంత్ ఎడిటర్ గా పనిచేసారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఆర్చివల్ రీసెర్చ్ ఛీఫ్ గా ఉన్నప్పుడు 150 యేండ్ల పత్రికల చరిత్రను వ్రాయుటకు బాధ్యత వహించాడు.[1] ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు ప్రచురించిన మరాఠీ పత్రిక "లోక్‌సత్తా"కు సంపాదకునిగా నియమింపబడ్డారు. అచట 1991 నుండి 2002 వరకు పనిచేసాడు. 2009లో పూణె విశ్వవిద్యాలయంలో జర్నలిజం, కమ్యూనికేషన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు అనేక సాహిత్య, జర్నలిజం అవార్డులు వచ్చాయి.[2][3] జూన్ 2010లో ముంబై లోని ఆసియాటిక్ సొసైటీ అధ్యక్షునిగా పనిచేసారు. ఆయా మహారాష్ట్ర@50 స్టడీ సెంటర్ ను ప్రారంభించారు.[4] ఆసియాటిక్ సొసైటీలో 200,000 పుస్తకాలు ఉన్నాయి. టికేకర్ ఆ పుస్తకాలను సంరక్షించుటకు క్రియాశీలకంగా కృషిచేసారు.[5]
భాషా, సాహిత్యాల్లో అద్భుత నైపుణ్యం గల ఆయన కొన్నేళ్ల పాటు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. దిల్లీలోని యూఎస్ లైబ్రరీ కాంగ్రెస్ కార్యాలయంలో అక్విజిషన్ నిపుణుడిగానూ పనిచేశారు. పాత్రికేయ వృత్తికీ అరూన్ టికేకర్ విస్తృత సేవలు అందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిఫరెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. దశాబ్ద కాలం (1992-2002) ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మరాఠీ పత్రికకు సంపాదకత్వం వహించారు. మహారాష్ట్ర టైమ్స్‌కు సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా, లోక్‌సత్తా పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు. మరాఠీ, ఆంగ్ల భాషల్లో 20పైగా పుస్తకాలు రాశారు.
అరూన్ టికేకర్ అనారోగ్య కారణాలతో 2016 జనవరి 19న కన్నుమూశారు.