అర్జున్ ముండా

అర్జున్ ముండా
అర్జున్ ముండా


ఝార్ఖండ్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
2010, సెప్టెంబరు నుంచి

వ్యక్తిగత వివరాలు

జననం (1968-01-05) 1968 జనవరి 5 (వయసు 56)
జంషెడ్పూర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జనవరి 8, 2012నాటికి

అర్జున్ ముండా (Arjun Munda) 1968, జనవరి 5న జంషెడ్పూర్ సమీపంలోని ఖ్రాంగఝార్‌లో జన్మించాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ఝార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి. 1980 దశాబ్దిలో ఝార్ఖండ్ ఉద్యమంలో భాగంగా రాజకీయాలలో చేరిన అర్జున్ ముండా ఝార్ఖండ్ ముక్తిమోర్చాకు దిశానిర్దేశం చేశాడు. 1995లో బీహార్ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికై 2000, 2005లలో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏర్పడిన బాబూలాల్ మురాండి మంత్రివర్గంలో అర్జున్ ముండా సాంఘిక సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా నియమించబడ్డాడు. 2003 మార్చిలో ముఖ్యమంత్రి మార్పు వల్ల ముండా ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా స్థానం పొందాడు. అప్పుడు రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పది రోజుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పొంది సెప్టెంబరు 2006 వరకు అధికారంలో కొనసాగినాడు. సెప్టెంబరు 2010లో మూడవ పర్యాయం ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నాడు.

మూలాలు

[మార్చు]