అర్థనా బిను | |
---|---|
జననం | తిరువనంతపురం, కేరళ, భారతదేశం |
విద్య | బాచిలర్ ఆఫ్ జర్నలిజం |
విద్యాసంస్థ | మార్ ఇవానియోస్ కాలేజ్, తిరువనంతపురం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | మలయాళ నటుడు విజయకుమార్ (తండ్రి) |
అర్థనా బిను తమిళం, మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేసే భారతీయ నటి. కేరళలోని తిరువనంతపురం నుండి వచ్చిన ఆమె 2016లో విడుదలైన తెలుగు చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు.[1] ఆమె ముద్దుగౌవ్ (2016), తొండన్ (2017), సెమ్మ (2018), కడైకుట్టి సింగం (2018) వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.[2]
ఆమె నటించిన తమిళ చిత్రం కడైకుట్టి సింగం, తెలుగులో చినబాబుగా 2018లో విడుదల అయింది.[3]
నటుడు విజయకుమార్, బిను డేనియల్ దంపతులకు అర్థన జన్మించింది. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు.[4] ఆమె త్రివేండ్రంలోని సర్వోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె 11వ తరగతి చదువుతున్నప్పుడే మలయాళంలో టెలివిజన్ ఛానెల్‌లలో యాంకరింగ్ చేయడం ప్రారంభించింది.[5]
ఆమె తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అండ్ వీడియో ప్రొడక్షన్‌లో చేరింది. ఆ సమయంలోనే, ఆమె మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. శ్రీకందన్ నాయర్ నిర్వహించిన, ఫ్లవర్స్ టీవీ ద్వారా ప్రసారమయ్యే వినోదభరితమైన ప్రసిద్ధ గేమ్ షో అయిన స్మార్ట్ షోకు యాంకరింగ్ చేయడం ద్వారా ఆమె ప్రొఫైల్ పెరిగింది.
2015లో, శ్రీకందన్ నాయర్‌కి సహ-హోస్ట్‌గా ఫ్లవర్స్ టీవీలో స్మార్ట్ షో అనే గేమ్ షో ద్వారా ఆమె తన కెరీర్ మొదలుపెట్టింది.
అర్థన 2016లో కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించిన రాజ్ తరుణ్‌తో కలిసి తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)లో నటించింది. అదే సంవత్సరంలో ఆమె క్రైమ్ ఫిక్షన్ కమ్ కామెడీ చిత్రం అయిన ముద్దుగౌవ్ (2016)లో గోకుల్ సురేష్‌తో కలిసి మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించింది.[6]
ఆ తర్వాత ఆమె విక్రాంత్, సముద్రఖని, సునయనలతో పాటు సముద్రకని దర్శకత్వం వహించిన తొండన్ (2017) ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. దర్శకుడు పాండిరాజ్ నిర్మాణంలో జీ. వి. ప్రకాష్ కుమార్‌తో తొండన్ కంటే ముందు ఆమె సంతకం చేసిన సెమ్మ (2018) ద్వారా కొనసాగింది, 2018 మే 25న విడుదలైంది. అందులో ఆమె నటనకు సానుకూల సమీక్షలు వచ్చాయి.[7] చలనచిత్ర దర్శకుడు పాండిరాజ్ చూసిన తర్వాత తమిళ ఫ్యామిలీ డ్రామా చిత్రం కడైకుట్టి సింగం (2018)లో కార్తీతో తన తదుపరి దర్శకత్వ వెంచర్‌లో ఆమెను ఎంపిక చేశాడు.[8][9]
ఆమె సెల్వ శేఖరన్ దర్శకత్వం వహించిన వెన్నిల కబడ్డీ కుజు 2 తమిళ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కథానాయికగా చేసింది. దీనికి దర్శకుడు సుసీంతిరన్ కాగా, ఇది 2009 విజయవంతమైన చిత్రం వెన్నిల కబడ్డీ కుజుకు కొనసాగింపు.[10]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు | సీతా మహాలక్ష్మి | తెలుగు | తెలుగు అరంగేట్రం | [11] |
ముద్దుగావ్ | గంగ | మలయాళం | మలయాళ అరంగేట్రం | [12] | |
2017 | తొండన్ | మహిషాసురమర్దిని | తమిళం | తమిళ అరంగేట్రం | [13] |
2018 | సెమ్మ | మాగిజిని | తమిళం | [14] | |
కడైకుట్టి సింగం | ఆండాళ్ ప్రియదర్శిని | తమిళం | [15] | ||
2019 | వెన్నిల కబడ్డీ కుజు 2 | మలార్ | తమిళం | [16] | |
2020 | షైలాక్ | పూంకుజలి | మలయాళం | [17] | |
2024 | అన్వేషిప్పిన్ కండెతుమ్ | శ్రీదేవి | మలయాళం | [18] | |
వాస్కో డా గామా | TBA | తమిళం | [19] |
అర్థనా బిను తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్థన తన చెల్లెలితో కలిసి తన తల్లితో ఉంటుంది. ఈ క్రమంలో అర్థన తన తండ్రి విజయ్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది. తన తండ్రి తనను సినిమాలు ఆపేయాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. అక్రమంగా తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన వీడియోను షేర్ చేసింది. విడాకులు తీసుకున్నప్పటికీ తన తండ్రి తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది.
అతనిపై కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇదంతా చేస్తున్నాడు. నేను షైలాక్ సినిమా చేస్తున్నప్పుడు అతను లీగల్ గా కేసు పెట్టాడు. దీంతో ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా ఇష్టానుసారంగా సినిమాలో నటిస్తున్నానన చట్టపరమైన పత్రంపై సంతకం చేయాల్సి వచ్చిందని వివరించింది.