అల వైకుంఠపురంలో | |
---|---|
దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
నిర్మాత | |
తారాగణం | |
ఛాయాగ్రహణం | పి స్ వినోద్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 12 జనవరి 2020 |
సినిమా నిడివి | 165 నిమిషాలు [1] |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 100 కోట్లు ₹100 crore[2] |
అల వైకుంఠపురములో 2020 సంక్రాంతికి విడుదల అయిన తెలుగు చలన చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్/హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన తారాగణం. ఇతర పాత్రలలో టబు, జయరాం,సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ నటించారు.
వర్షం పడుతోన్న రాత్రి స్కూటర్ పై వాల్మీకి (మురళి శర్మ) వచ్చే సన్నివేశంతో చిత్రం మొదలౌతుంది. అప్పుడే ప్రసవించిన తన భార్యను, బిడ్డను చూడటానికి వచ్చిన వాల్మీకి, అక్కడ రామచంద్ర (జయరాం) కు చెందిన కారును చూసి ఈర్ష్య పడతాడు. వాల్మీకి, రామచంద్ర ఒకే సంస్థలో సహోద్యోగులుగా చేరినా, ఆ సంస్థ యజమాని అయిన ఆదిత్య రాధాకృష్ణన్ అలియాస్ ఏ ఆర్ కే (సచిన్ ఖేడేఖర్) కుమార్తె యసు (టబు)ను రామచంద్రకు ఇచ్చి పెళ్ళి చేయటంతో అతని దశ తిరుగుతుంది. యసు కూడా అదే ఆస్పత్రిలో ప్రసవించటం, అయితే యసు కన్న బిడ్డలో కదలిక లేకపోవటం గమనించిన ఆస్పత్రి నర్సు, ఆ విషయాన్ని వాల్మీకి కి చెబుతుంది. నర్సు ముందు మంచిగా నటిస్తూ వాల్మీకి తన బిడ్డను యసు బిడ్డ స్థానం లో ఉంచి,యసు బిడ్డను తన భార్య ప్రక్కన పెట్టమని చెబుతాడు. ఇంతలో యసు బిడ్డలో కదలిక వచ్చినా, ఈ మార్పు జరగవలసిందేనని వాల్మీకి పట్టుబడతాడు. అక్కడ జరిగే పెనుగులాటలో నర్సు క్రిందపడి స్పృహ కోల్పోతుంది. వాల్మీకి కి శాశ్వతంగా కాలు పట్టేస్తుంది.
బిడ్డల మార్పు జరిగిందా? ఎవరి వద్ద ఎవరు ఎలా పెరిగారు? వాల్మీకి గుట్టు రట్టయిందా? దాని ఫలితాలు ఏమిటి? అన్నదే చిత్రం తదుపరి కథ.
ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం జనవరి 12న, 2020 లో విడుదలయ్యింది. అమెరికాలో 11నే, ఇండియాకంటే ఒక రోజు ముందుగానే విడుదలయిపోయింది. మళయాళంలో, అంగు వైకుంటపురతు అనే పేరుతో, అదేరోజున కేరళలో విడుదలయ్యింది. బైకుంతపురము నితేగా, జపాన్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు.[4]
ఫస్ట్ పోస్ట్ కు చెందిన హేమంత్ కుమార్ 3.5 రేటింగు ఇస్తే, "మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఫాం లో ఉంటే ఆయన రాసేదేదైనా చెవికి సంగీతంలానే ఉంటుంది. పాత్రలు తమ మాటలు/పాటలతో మనస్సుకు హత్తుకొని పోయేలా చేస్తాడు. అయితే దీనికి భిన్నంగా ఈ చిత్రంలో ఆయన పాత్రల మధ్య భావోద్రేకపూరిత నాటకీయత పై తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించాడు. పంచ్ డైలాగులు, హాస్యం కంటే పాత్రల మధ్య సాగే సంభాషణలు తమదైన ముద్ర వేస్తాయి." అని తెలిపాడు.[5]
ద హన్స్ ఇండియా 3.25 రేటింగ్ ఇస్తూ, నటన, కథనం, నేపథ్యసంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు అని, పెద్దగా మైనస్ పాయింట్లు ఏవీ లేవని తెలిపింది. త్రివిక్రం కథ, అల్లు అర్జున నటనా ప్రతిభకు పట్టం కట్టింది. ఖచ్చితంగా చూడవలసిన చిత్రం అని తేల్చింది.[6]
"తొలిసారి అల్లు అర్జున్ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశాడు. తన మార్కు స్టైల్ తో కనిపిస్తూనే పంచ్ లు, కామెడీ సన్నివేశాలలో అదరగొట్టేశారు. నాయికానాయకుల మధ్య సన్నివేశాలు తెరపై అందంగా ఉన్నాయి. మధ్య తరగతి తండ్రిగా మురళీ శర్మ నటన చాలా చక్కగా ఉంది. ఆద్యంతం తన మేనరిజంతో ఆకట్టుకొన్న మురళి శర్మకు చిత్రంలో అల్లు అర్జున తర్వాత స్థాయి పాత్ర దక్కింది. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. కథా నేపథ్యం పాతదే అయినా త్రివిక్రం చూపించిన విధానం కొత్తగా ఉంది. ఇన్ని పాత్రలను తెరపైన చూపిస్తూ, ప్రతి పాత్రకు ప్రత్యేకత కల్పించడం త్రివిక్రం కే చెల్లింది." అని ఈనాడు తెలిపింది.[7]
"బన్ని అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎనర్జీ, డ్యాన్స్‌లు, కామెడీ పంచింగ్ టైమ్. అయితే ఈ సినిమాలో వీటితో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.. మైమరిపించాడు.ఈ సినిమాతో నటుడిగా, హీరోగా వంద శాతం ప్రూవ్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ తర్వాత చెప్పుకోవాల్సింది మురళీ శర్మ గురించి. కన్నింగ్, శాడిజం ఇలా పలు వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొడుకుపై శాడిజం చూపించే తండ్రిగా మురళీ శర్మ జీవించాడు. పూజా హేగ్డే చాలా అందంగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో బన్ని చెప్పినట్టు ‘మేడమ్ సర్.. మేడమ్ అంతే’ అనే విధంగా పూజా ఉంటుంది. అందంతో పాటు అభినయంతో హావభావాలను పలికించింది.పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన విస్తరిలా నిండుగా, అందంగా ఈ సినిమా ఉంటుంది. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. అల్లు అర్జున్ కామెడీ టైమింగ్, యాక్టింగ్, డ్యాన్స్‌లు, పాటలు సింపుల్‌గా చెప్పాలంటే సినిమా సరదా సరదాగా, ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగుతూ వెళ్తుంది. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అయితే కథ ముందే చెప్పేసి దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలోంచి లేవకుండా చేయడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. కథ ముందే తెలిసినా తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగేలా స్క్రీన్ ప్లే ఉంటుంది." అని సాక్షి కి చెందిన సంతోష్ యాంసాని తెలిపారు.[8]
తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద విజయవంతమైన సినిమాగా అల వైకుంఠపురములో నిలిచింది. అంతేకాక రికార్డుల పరంగా బాహుబలి 2 తరువాత స్థానంలో నిలిచి ఎన్నో కొత్త రికార్డులను నమోదుచేసుకుంది. కేరళలో మలయాళం లోకి డబ్ చేయబడిన ఈ చిత్రం మొదటి రోజు ముప్పై బెనిఫిట్ షో లు ప్రదర్శింపబడింది. ఒక డబ్బింగ్ మూవీకి కేరళ లో ఇది రికార్డు.[9][10]
2020 సైమా అవార్డులు
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)