![]() అలీమ్-ఉద్-దిన్ (1962) | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | అజ్మీర్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు భారతదేశం) | 1930 డిసెంబరు 15|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2012 జూలై 12 నార్త్విక్ పార్క్ హాస్పిటల్, హారో, లండన్, ఇంగ్లాండ్ | (వయసు: 81)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 15) | 1954 జూన్ 10 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 జూలై 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1943 | రాజస్థాన్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1944–1947 | గుజరాత్ | |||||||||||||||||||||||||||||||||||||||
1946 | ముస్లింల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1948 | సింధ్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1953–1954 | బహవల్పూర్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1954–1965 | కరాచీ | |||||||||||||||||||||||||||||||||||||||
1956–1957 | కరాచీ వైట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
1957 | కరాచీ ఎ | |||||||||||||||||||||||||||||||||||||||
1961–1966 | కరాచీ బ్లూస్ | |||||||||||||||||||||||||||||||||||||||
1967–1968 | పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2012 ఆగస్టు 29 |
అలీమ్-ఉద్-దిన్[1] (1930, డిసెంబరు 15 - 2012 జూలై 12) పాకిస్థానీ క్రికెటర్. 1954 - 1962 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున 25 టెస్టులు ఆడాడు. ఇతని పేరు కొన్నిసార్లు అలీముద్దీన్ అని పిలువబడుతుంది. ఫాస్ట్ స్కోరింగ్ గా, కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్ గా రాణించాడు. 12 సంవత్సరాల 73 రోజుల వయస్సు గల ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కనిపించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలూ 25.37 సగటుతో 1,091 పరుగులు చేశాడు. 1954లో, అతను ఇంగ్లాండ్‌లో పర్యటించిన పాకిస్తానీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్తాన్ యొక్క మొదటి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని నమోదు చేశాడు.
ఇతని కెరీర్‌లో అలీమ్-ఉద్-దిన్ 140 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 14 సెంచరీలు, 38 అర్ధసెంచరీలూ 32.77 సగటుతో 7,275 పరుగులు చేశాడు. 40 వికెట్లు కూడా తీశాడు.[2] కేవలం 12 సంవత్సరాల 73 రోజుల వయస్సులో రాజస్థాన్ తరపున అరంగేట్రం చేసాడు, ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.[3] 1942-43లో, రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 13, 27 పరుగులు చేశాడు.[4] 1948లో వెస్ట్ ఇండియన్స్, సింధ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ గడ్డపై అంతర్జాతీయ బౌలర్ వేసిన బంతిని ఎదుర్కొన్న మొదటి పాకిస్తానీ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.[5][6][7] పాకిస్తాన్ 1954 ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి రెండు మ్యాచ్‌లలో రెండు సెంచరీలతోపాటు 700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.[8] 1961-62 సమయంలో 12 మ్యాచ్‌లలో 51.00 సగటుతో 1,020 పరుగులు చేశాడు.[9] అదే సీజన్‌లో కరాచీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ, అయూబ్ జోనల్ ట్రోఫీలో జట్టును విజయాల వైపు నడిపించాడు.[3][10][11][12] ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో చివరి సీజన్ 1967–68.[9]
తన కెరీర్‌లో పాకిస్థాన్ తరపున 25 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25.37 సగటుతో 1,091 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు చేశాడు.[2] టెస్ట్ మ్యాచ్‌లలో హనీఫ్ మొహమ్మద్‌తో సమర్థవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.[3]
1954 జూన్ లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 19 పరుగులతో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. [13] 1954-55లో, పాకిస్తాన్ మొదటి స్వదేశంలో జరిగిన టెస్ట్‌లలో భారత్ తో ఆడాడు. 332 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా సిరీస్‌ను ముగించాడు. మూడు అర్ధసెంచరీలు చేసాడు. ఐదవ మ్యాచ్‌లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇది మొదటి అంతర్జాతీయ సెంచరీ.[14][15] [16] మైదానంలో అంతర్జాతీయ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[17]
1962లో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో ఐదవ టెస్టులో, నేషనల్ స్టేడియంలో తన కెరీర్‌లో అత్యుత్తమ 109 పరుగులు చేశాడు.[18] ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు.[19]
అలీమ్-ఉద్-దిన్ 2012 జూలై 12న లండన్, హారోలోని నార్త్‌విక్ పార్క్ హాస్పిటల్మరణించాడు.[17] గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడ్డాడు. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చి డయాలసిస్ చేయించుకున్నాడు.[17] పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అలీం-ఉద్-దిన్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, సంతాపాన్ని తెలియజేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.[20][21]
ప్రత్యర్థి | మ్యాచ్‌లు | ఇన్నింగ్స్ | స్థానం | పరుగులు | అత్యధిక స్కోర్ | సరాసరి | 100 | 50 | క్యాచౌట్ | స్టంపౌట్ |
---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
2 | 4 | 1 | 59 | 34* | 19.66 | 0 | 0 | 1 | – |
![]() |
8 | 16 | 0 | 410 | 109 | 25.62 | 1 | 4 | 2 | – |
![]() |
6 | 10 | 1 | 356 | 103* | 39.55 | 1 | 3 | 0 | – |
![]() |
3 | 4 | 3 | 74 | 37 | 18.50 | 0 | 0 | 4 | – |
![]() |
6 | 11 | 0 | 192 | 41 | 17.45 | 0 | 0 | 1 | – |
Total | 25 | 45 | 2 | 1091 | 109 | 25.37 | 2 | 7 | 8 | – |
సంఖ్య | పరుగులు | ప్రత్యర్థి జట్టు | స్థానం | ఇన్నింగ్స్ | వేదిక | H/A/N | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 103 | ![]() |
2 | 3 | నేషనల్ స్టేడియం, కరాచీ | హోమ్ | 1955 ఫిబ్రవరి 26 | డ్రా[14] |
2 | 109 | ![]() |
6 | 1 | నేషనల్ స్టేడియం, కరాచీ | హోమ్ | 1962 ఫిబ్రవరి 2 | డ్రా[18] |