అల్కా కౌశల్ | |
---|---|
జననం | అల్కా బడోలా |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రవి జి. కౌశల్ |
పిల్లలు | 1 |
బంధువులు | వరుణ్ బడోలా (సోదరుడు) |
అల్కా బడోలా కౌశల్ భారతీయ సినిమా నటి, నిర్మాత. హిందీ సినిమారంగంలో ప్రసిద్ధి చెందింది. కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్, కుబూల్ హై వంటి టీవీ షోలలో, టీవీ సీరియల్స్‌లో సహాయక పాత్రలలో నటించింది.[1][2][3][4] మోస్ ఛల్ కియే జాయేలో సుష్మా ఒబెరాయ్ పాత్రను పోషించింది.
అల్కా బడోలా కౌశల్ ఢిల్లీలో రంగస్థల కళాకారుడు విశ్వ మోహన్ ఎస్. బడోలా, సుశీల బడోలా దంపతులకు జన్మించింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీలో చేరి నటనలో శిక్షణ పొందింది. టెలివిజన్ సీరియళ్ళలో నటించడానికి ముంబైకి వెళ్ళింది.
టివి నిర్మాత, దర్శకుడు రవి జి. కౌశల్‌తో అల్కా బడోలా కౌశల్ వివాహం జరిగింది. వీరు తమ సొంత నిర్మాణ సంస్థ మంగళం ఆర్ట్స్‌ని ప్రారంభించారు.
నటిగా:
సంవత్సరం | కార్యక్రమం | పాత్ర |
---|---|---|
2002–2007 | కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ | సుకన్య వాధ్వా |
2002–2003 | కమ్మల్ | |
2004–2005 | ప్రతిమ | ఆశా ధర్మేష్ ఠాకూర్ |
2009–2010 | జ్యోతి | చోటీ మా |
2011–2012 | డోంట్ వర్రీ చచ్చు | |
2012–2015 | ఖుబూల్ హై | రజియా గఫూర్ అహ్మద్ సిద్ధిఖీ |
2014 | హమారీ సోదరి దీదీ | శ్రీమతి. కపూర్ |
2015–2016 | స్వరాగిణి | పార్వతి దీనదయాళ్ గడోడియా |
2016 | సరోజిని | తారకేశ్వరి సింగ్ |
2017 | సంతోషి మా | క్రాంతి మా |
2018 | వో అప్నా సా | అంబికా ఖన్నా |
2019 | బహు బేగం | గజాలా మీర్జా |
షాదీ కే సియాపే | ఫ్యాన్సీ | |
2020 | యే రిష్తా క్యా కెహ్లతా హై | సీతా చౌదరి |
నాజర్ 2 | నర్మదా చౌదరి | |
బారిస్టర్ బాబు | తారా బాయి | |
2020–2021 | శౌర్య ఔర్ అనోఖి కి కహానీ | దేవి సబర్వాల్ |
2021 | చోటి సర్దార్ని | రింపుల్ బబ్బర్ |
2022 | మోసే ఛల్ కియే జాయే | సుష్మా హర్షవర్ధన్ ఒబెరాయ్ |
సంవత్సరం | సినిమా | పాత్ర | ితర వివరాలు |
---|---|---|---|
2014 | రాణి | శ్రీమతి మెహ్రా | |
2015 | ధరమ్ సంకట్ మే | ధరమ్ పాల్ భార్య | |
2015 | బజరంగీ భాయిజాన్ | కరీనా కపూర్ తల్లి | |
2018 | వీరే ది వెడ్డింగ్ | శ్రీమతి సంతోష్ భండారి | |
2018 | సూర్మ | తాప్సీ తల్లి | |
2018 | బధాయి హో | ఆయుష్మాన్ ఖురానా అత్త (గుడాన్ భువా) | |
2020 | ఇందూ కీ జవానీ | ఇండో తల్లి |