పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Aluminum arsenate
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [13462-91-4] |
పబ్ కెమ్ | 57351442 |
SMILES | [O-][As](=O)([O-])[O-].[Al] |
| |
ధర్మములు | |
AlAsO4 | |
మోలార్ ద్రవ్యరాశి | 165.901 g/mol |
స్వరూపం | white crystals |
సాంద్రత | 3.25 g/cm3 |
ద్రవీభవన స్థానం | 1,000 °C (1,830 °F; 1,270 K) |
insoluble | |
వక్రీభవన గుణకం (nD) | 1.596 |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
hexagonal |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-1431.1 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
145.6 J/mol K |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
అల్యూమినియం ఆర్సెనేట్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.అల్యూమినియం ఆర్సెనేట్ రసాయన సంకేత పదం AlAsO4[1].అల్యూమినియం, ఆర్సెనిక్, ఆక్సిజన్ మూలకంల పరమాణు సంయోగ ఫలితంగా అల్యూమినియం ఆర్సెనేట్ సంయోగ పదార్థం ఏర్పడినది.అల్యూమినియం ఆర్సెనేట్ సాధారణంగా అష్ట జలాణువులు ఉన్న ఆక్టాహైడ్రేట్ అల్యూమినియం ఆర్సెనేట్ (AlAsO4.8H2O గా లభిస్తుంది.
కరిగే లక్షణమున్న అల్యూమినియం లవణం, సోడియం ఆర్సెనేట్ మధ్య రసాయన వలన రంగులేని ఘన అల్యూమినియం ఆర్సెనేట్ ఏర్పడును.అల్యూమినియం ఆర్సెనేట్ ప్రకృతిలో మాన్స్ ఫీల్డైట్ (mansfieldite) ఖనిజముగా లభిస్తుంది.[2] హైడ్రోథెర్మల్ విధానంలో ఉత్పత్తిఅగు సింథటిక్ జలాయుత అల్యూమినియం ఆర్సెనేట్ ఈ విధంగా Al2O3.3As2O5.10H2O రూపంలో ఉండును[3]
వివిధ ఉష్ణోగ్రత లవద్ద వివిధ ప్రమాణంలో అర్థోఅర్సేనేట్ ను వేడి చెయ్యడం వలన రూపవిహినత, స్పటికాకార అల్యూమినియం ఆర్సెనేట్ ఏర్పడును.[4]
గాలియం అర్సేనేట్, బోరాన్ ఆర్సేనేట్ ల వలె అల్యూమినియం ఆర్సెనేట్ α-క్వార్జ్ రకపు సౌష్టవం కల్గి ఉంది.
అల్యూమినియం ఆర్సెనేట్ తెల్లని స్పటిక ఘనపదార్థం.అల్యూమినియం ఆర్సెనేట్ అణుభారం 165.901 గ్రాములు/మోల్.25 °C వద్ద అల్యూమినియం ఆర్సెనేట్ సంయోగ పదార్థం సాంద్రత 3.25 గ్రాములు/సెం.మీ3.అల్యూమినియం ఆర్సెనేట్ ద్రవీభవన స్థానం 1,000 °C (1,830 °F;1,270 K).నీటిలో అల్యూమినియం ఆర్సెనేట్ కరుగదు. అల్యూమినియం ఆర్సెనేట్ వక్రీభవన సూచిక 1.596