అల్లరి ప్రేమికుడు (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | జగపతి బాబు, సౌందర్య, రమ్యకృష్ణ, రంభ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ సత్యదుర్గాఆర్ట్స్ |
భాష | తెలుగు |
అల్లరి ప్రేమికుడు 1994లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఇందులో జగపతి బాబు, సౌందర్య, రంభ, కాంచన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్, సత్యానంద్ కలిసి శ్రీ సత్యదుర్గాఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[2][3] ఇది తమిళంలో పోక్కిరి కాదలన్ అనే పేరుతో అనువాదం అయింది.
కృష్ణమూర్తి అలియాస్ కిట్టు తన స్నేహితుడైన చంద్రంతో పందేలు కాస్తుంటాడు. ఒకసారి కృష్ణమూర్తి భవాని, ఝాన్సీ, జోగీశ్వరి దేవి అనే ముగ్గురు అమ్మాయిలను ప్రేమలోకి దింపుతానని చంద్రంతో పందెం కాస్తాడు. కిట్టు ఒక హోటల్ లో సంగీత కళాకారుడుగా పనిచేస్తాడు. భవాని కళాశాలలో చదువుతూ మహిళల తరపున పోరాడుతుంటుంది. ఆమెకు తగినట్టుగా కిట్టు మహిళలను గౌరవించేవాడిగా ప్రవర్తిస్తుంటాడు. కిట్టు ఖాన్ దాదా పేరుతో చలామణి అయ్యే అహోబిలంతో ఒప్పందం కుదుర్చుకుని అతను మహిళలను వేధిస్తుండగా అతన్ని ఎదిరించి భవాని తనను అభిమానించేలా చేస్తాడు.
ఝాన్సీ పోలీస్ ఇన్స్పెక్టర్. కిట్టు ఈసారి మరో దాదాతో మాట్లాడుకుని ఆమె సోదరుని అపహరించి కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు నాటకం ఆడతాడు.