అల్లరి రాముడు | |
---|---|
దర్శకత్వం | బి.గోపాల్ |
రచన | పరుచూరి సోదరులు |
నిర్మాత | చంటి అడ్డాల |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ ఆర్తీ అగర్వాల్ గజాలా కె.విశ్వనాధ్ విజయ నరేష్ నగ్మా |
ఛాయాగ్రహణం | కె. రవీంద్రబాబు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఆర్.పి.పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఫ్రెండ్లీ మూవీస్ |
విడుదల తేదీ | 18 జూలై 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అల్లరి రాముడు 2002, జూలై 18న విడుదలైన తెలుగు సినిమా. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మాణ సారథ్యంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, ఆర్తీ అగర్వాల్, గజాలా, కె.విశ్వనాధ్, విజయ నరేష్, నగ్మా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రంలో నగ్మా పాత్రకు నటి సరిత డబ్బింగ్ చెప్పింది. 2007లో హిందీలోకి మైన్ హూన్ ఖుద్దర్ పేరుతో అనువదించబడింది. బంగ్లాదేశ్ బెంగాళీలోకి నంబర్ వన్ షకిబ్ ఖాన్ పేరుతో రిమేక్ చేయబడింది.
వ్యాపారవేత్త ఛాముండేశ్వరి (నగ్మా) ఇంట్లో రాము (ఎన్.టి.ఆర్.) పనిచేస్తుంటాడు. అమె అందాల కూతురు మైథిలి (ఆర్తి అగర్వాల్) ను రాము ప్రేమిస్తాడు. తన కుమార్తె పట్ల రాము ప్రేమను తెలుసుకున్న ఛాముండేశ్వరి వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది.[2][3]
ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
అల్లరి రాముడు | ||||
---|---|---|---|---|
పాటలు by ఆర్.పి. పట్నాయక్ | ||||
Released | 2002 | |||
Recorded | 2002 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 27.14 | |||
Language | తెలుగు | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | ఆర్.పి. పట్నాయక్ | |||
ఆర్.పి. పట్నాయక్ chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఒప్పులకుప్ప (రచన: చైతన్య ప్రసాద్)" | ఉష, ఆర్.పి. పట్నాయక్ | 4:13 | ||||||
2. | "రెండు వేల రెండు వరకు (రచన: పోతుల రవికిరణ్)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉష | 5:11 | ||||||
3. | "చెలియా (రచన: చైతన్య ప్రసాద్)" | ఉష, ఆర్.పి. పట్నాయక్ | 4:27 | ||||||
4. | "జడకు జడ (రచన: పోతుల రవికిరణ్)" | మనో, ఉష, ఆర్.పి. పట్నాయక్ | 4:09 | ||||||
5. | "బొడ్డుని చూడయ్యో (రచన: పోతుల రవికిరణ్)" | ఉష, కార్తీక్ | 5:07 | ||||||
6. | "రుక్కుమిణి (రచన: చైతన్య ప్రసాద్)" | ఉష, రవివర్మ | 4:07 | ||||||
27.14 |