అల్లుడు అదుర్స్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | సంతోష్ శ్రీనివాస్ |
రచన | సంతోష్ శ్రీనివాస్ శ్రీకాంత్ విస్సా (మాటలు) |
నిర్మాత | గొర్రెల సుబ్రహ్మణ్యం |
తారాగణం | బెల్లంకొండ శ్రీనివాస్ నభా నటేష్ అను ఇమ్మాన్యుయేల్ సోనూ సూద్ ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 14 జనవరి 2021 |
సినిమా నిడివి | 149 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అల్లుడు అదుర్స్ 2021, జనవరి 14న వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.[1]
సాయి శ్రీనివాస్ అలియాస్ శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఓ చలాకీ కుర్రాడు. తొమ్మిదో తరగతిలోనే వసుంధర (అను ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల కారణంగా వసుంధర.. శ్రీనుని వదిలి వెళ్లిపోతుంది. దీంతో శ్రీనుకి ప్రేమంటే అసహ్యం కలుగుతుంది. జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదు అనుకుంటాడు. కానీ, తొలి చూపులోనే కౌముదితో (నభానటేశ్) ప్రేమలో పడతాడు. పది రోజుల్లో కౌముదిని ప్రేమలోకి దింపుతానని ఆమె తండ్రి జైపాల్ రెడ్డితో (ప్రకాశ్‌రాజ్) ఛాలెంజ్ చేస్తాడు. మరి, శ్రీను.. కౌముది ప్రేమను గెలుచుకున్నాడా? గజ (సోనూసూద్)తో శ్రీనుకు ఉన్న వైరం ఏమిటి? శ్రీను జీవితంలోకి వసుంధర తిరిగి ఎందుకు వచ్చింది? కౌముదికి, వసుంధరకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అనేదే ఈ చిత్ర కథ.[2]
{{cite web}}
: CS1 maint: url-status (link)