విధి | మానవ రహిత, పునర్వినియోగ అంతరిక్ష విమానం |
---|---|
తయారీదారు | DRDO |
దేశము | ![]() |
పరిమాణము | |
ద్రవ్యరాశి | 25 టన్నులు [1] |
దశలు | 1 |
సామర్థ్యము | |
భూ నిమ్న కక్ష్య కు పేలోడు |
1,000 కి.గ్రా. (2,200 పౌ.) |
ప్రయోగ చరిత్ర | |
స్థితి | భావనా మాత్రం |
మొత్తం ప్రయోగాలు | 0 |
మొదటి దశ | |
ఇంజన్లు | ర్యామ్‌జెట్, స్క్రామ్‌జెట్, క్రయోజెనిక్ రాకెట్ ఇంజను |
థ్రస్టు | |
మండే సమయం | |
ఇంధనం | LOX/LH2 |
అవతార్ ("ఏరోబిక్ వెహికిల్ ఫర్ ట్రాన్స్ అట్మాస్ఫెరిక్ హైపర్‌సోనిక్ ఏరోస్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ - Aerobic Vehicle for Transatmospheric Hypersonic Aerospace TrAnspoRtation") భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేపట్టిన ఒక అధ్యయనం. విమానంలాగా క్షితిజ సమాంతరంగా గాల్లోకి లేచి, అంతరిక్షంలోకి వెళ్ళి, తిరిగి వెనక్కు వచ్చి విమానంలాగే కిందికి దిగే అంతరిక్ష నౌక సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే ప్రాజెక్టు ఇది. తక్కువ ఖర్చుతో సైనిక, వాణిజ్య ఉపగ్రహాలను భూ నిమ్న కక్ష్యలోకి పంపించడం ఈ ప్రాజెక్టు భావన.[2][1][3] 2001 తరువాత ఈ విషయమై పురోగతి లేదు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పునర్వినియోగ వాహక నౌక అభివృద్ధి ప్రాజెక్టుకూ దీనికీ సంబంధం లేదు.[4]
సాంప్రదాయిక విమానాశ్రయాల నుండి అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ భావనలోని ఉద్దేశం. అవతార్ భావనను మొట్టమొదటిసారి 1998 మే లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ఎక్జిబిషన్‌లో ప్రకటించారు.[5]
అవతార్ 25 టన్నుల బరువుంటుంది. ఇందులో 60% వరకూ ద్రవ హైడ్రోజెన్ ఇంధనమే.[1] అంతరిక్షంలో ఈ ఇంధనం మండటానికి అవసరమైన ఆక్సిజన్‌ను, వాతావరణంలో ప్రయాణించేటపుడు గాల్లోంచి తీసుకుంటుంది. గాల్లోంచి ఆక్సిజన్‌ను వేరు చేసి దాన్ని ద్రవీకరించి, అంతరిక్షంలో వాడుకుంటుంది. తద్వారా, ప్రయోగ సమయంలోనే ఆక్సిజన్‌ను మోసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు.[1] సూత్రప్రాయంగా సాంకేతిక వివరాలు: భూ నిమ్న కక్ష్య లోకి తీసుకువెళ్ళగలిగిన పేలోడు 1,000 కి.గ్రా. 100 దాకా ప్రయోగాలు చెయ్యగలిగే సామర్థ్యం.[2][1]
అవతార్, హైడ్రోజన్‌ను వాతావరణంలోని ఆక్సిజన్‌నూ వాడి, టర్బో ర్యామ్‌జెట్ ఇంజన్ల ద్వారా గాల్లోకి లేచి ప్రయాణిస్తుంది.[1] వాతావరణంలో ప్రయాణించే ఈ దశలో నౌకలోని ఒక వ్యవస్థ వాతావరణంనుండి గాలిని పీల్చుకుని, దాన్నుండి ఆక్సిజన్‌ను వేరుచేసి, దాన్ని ద్రవీకరించి దాచుతుంది. తుది దశలో, అంతరిక్షంలో ప్రయాణించేటపుడు హైడ్రోజన్‌ను మండించేందుకు ఈ ఆక్సిజన్‌ను వాడుకుంటుంది. కనీసం వంద యాత్రలు జరిపేలా ఈ నౌకను డిజైను చేస్తారు.[1]
అవతార్ సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని 2001 లో డిఆర్‌డివో చేపట్టింది.[2] ఇస్రోకు దీనితో సంబంధం లేదు.[4] ఈ ఆధ్యయనానికి నేతృత్వం వహించిన ఎయిర్ కమోడోర్ రాఘవన్ గోపాలసామి 2001 జూలై 10 న అమెరికాలో జరిగిన ఒక కాన్ఫరెన్సులో దీని గురించి ఒక ప్రదర్శన చేసాడు.[2][1] 1987లో అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్ చేసిన ఒక ప్రచురణ నుండి అవతార్ భావన ఉద్భవించిందని ఆయన చెప్పాడు.[1]
2001 తరువాత ఈ విషయమై అభివృద్ధి ఏమీ జరగలేదు.[6]
Feasibility study of project "AVATAR)" has been done by a group of scientists in DRDO. ISRO has no connection with the project.ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Avatar is DRDO" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
Last year of effort: 2001