అవసరాల శ్రీనివాస్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | శ్రీ, శ్రీని, లంబూ |
వృత్తి | నటుడు, రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007-ప్రస్తుతం |
తల్లిదండ్రులు | వెంకట సత్యనారాయణ మూర్తి, నాగమణి |
అవసరాల శ్రీనివాస్ భారతీయ నటుడు, దర్శకుడు, సినిమా స్క్రిప్ట్ రచయిత. హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ కొద్ది రోజులు విజయవాడ, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కతాలలో నివసించారు. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలసిస్ విషయంలో ప్రిన్స్‍టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో పనిచేసారు.[1] యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్ (UCLA) నుండి స్క్రీన్ రైటింగ్ లో డిప్లోమా పొందారు. లీస్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్ వద్ద సంవత్సరం పాటు నటనలో శిక్షణ పొందారు. న్యూయార్క్ లో కొన్ని రోజులు రంగస్థలంలో పనిచేసి, ఆపై బ్లైండ్ ఆంబిషన్ అనే చిత్రానికి సహదర్శకుడిగా పనిచేసారు. యూనివర్సల్ స్టూడియోస్ వద్ద స్క్రిప్ట్ స్క్రీనర్ గా పనిచేసారు. అష్టా-చమ్మా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కొని సన్నివేశాలను వ్రాయటంలో సహాయమందించారు.[2] ముగ్గురు, పిల్ల జమీందార్, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ లాంటి సినిమాలల్ పనిచేసారు. ఊహలు గుసగుసలాడే అనే ప్రేమ-హాస్య కథా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.[3]
2022 డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలవుతున్న అవతార్ 2(అవతార్: ది వే ఆఫ్ వాటర్) సినిమాకు తెలుగు మాటలు అవసరాల శ్రీనివాస్ అందించారు.[4]
అవసరాల శ్రీనివాస్ స్వస్థలం కాకినాడ. హైదరాబాదులో పెరిగాడు. తండ్రి బ్యాంకర్.[5] విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై, కోల్ కతలో కూడా కొద్ది రోజులున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. కొద్ది రోజుల పాటు ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. స్క్రీన్ రైటింగ్, సినిమా సంబంధిత కోర్సులు కొన్ని పూర్తి చేశాడు.[6]
2008 లో విడుదలైన అష్టా చమ్మా సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[7]
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2007 | బ్లైండ్ ఆంబిషన్ | సహదర్శకత్వం | |
2008 | అష్టా-చమ్మా | ఆనంద్ | |
2010 | ఆరెంజ్ | అజయ్ | |
సరదాగ కాసేపు | శ్రీనివాస్ | ||
2011 | వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్ | వర ప్రసాద్ | |
ముగ్గురు | అంజి | ||
పిల్ల జమీందార్ | కన్న బాబు | ||
2013 | అమృతం చందమామలో | అమృత రావు | |
అడ్డా[8] | కిషోర్ | ||
అంతకు ముందు... ఆ తరువాత... | విశ్వ | ||
అరవింద్ 2 | చిత్ర దర్శకుడు | ||
సుకుమారుడు | ఏఎన్ఆర్ | ||
చమ్మక్ చల్లో | కిషోర్ | ||
2014 | గోవిందుడు అందరివాడేలే | డాక్టర్ ఎన్. రాజు | |
ఊహలు గుసగుసలాడే | ఉదయ్ భాస్కర్ | రచయిత, దర్శకుడు కూడా | |
2015 | జిల్ | అజయ్ | |
ఎవడే సుబ్రహ్మణ్యం | ప్రభాకర్ | ||
బందిపోటు | చీకటి | ||
కంచె | దాస్ | ||
2016 | నాన్నకు ప్రేమతో | అభిరామ్ సోదరుడు | |
రాజా చెయ్యి వేస్తే | చక్రి | ||
అ ఆ | శేఖర్ బెనర్జీ | ||
జెంటిల్ మేన్ | వంశీ | ||
ఒక మనసు | సత్య | ||
2017 | బాబు బాగా బిజీ | మాధవ్ / మ్యాడీ | |
అమీ తుమీ | విజయ్ | ||
మేడ మీద అబ్బాయి | సీబీసీఐడీ అధికారి నరేష్ | ||
పిఎస్‌వి గరుడ వేగ | ప్రకాష్ | ||
ఒక్క క్షణం | శ్రీనివాస్ | ||
2018 | అ! | శివుడు | |
మహానటి | ఎల్వీ ప్రసాద్ | అతిధి పాత్ర | |
సమ్మోహనం | అతనే | ప్రత్యేక ప్రదర్శన | |
దేవదాస్[9] | రాజన్ | ||
అంతరిక్షం | మోహన్ | ||
2019 | ఎన్టీఆర్: కథానాయకుడు | డివి నరస రాజు | అతిధి పాత్ర |
కథనం | |||
ఊరంతా అనుకుంటున్నారు | శివ రామన్ అయ్యర్ | ||
2020 | నిశ్శబ్దం | పూర్ణ చంద్రరావు | |
2021 | నూటొక్క జిల్లాల అందగాడు | గొట్టి సూర్య నారాయణ | రచయిత కూడా |
2022 | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | డాక్టర్ వరుణ్ | |
2023 | పిండం | ||
2014 | కిస్మత్ | వివేక్ | |
శ్రీరంగనీతులు |
సంవత్సరం | సినిమా | దర్శకుడు | రచయిత | గమనికలు |
---|---|---|---|---|
2011 | గోల్కొండ హైస్కూల్ | కాదు | సంభాషణ | |
2014 | ఊహలు గుసగుసలాడే | అవును | అవును | |
2016 | జ్యో అచ్యుతానంద | అవును | అవును | |
2021 | నూటొక్క జిల్లాల అందగాడు | కాదు | అవును | [10] |
2022 | బ్రహ్మాస్త్రం | కాదు | సంభాషణ | తెలుగు డబ్బింగ్ వెర్షన్[11] |
2022 | అవతార్: ది వే ఆఫ్ వాటర్ | కాదు | సంభాషణ | తెలుగు డబ్బింగ్ వెర్షన్[12] |
2023 | ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి | అవును | అవును | [13] |
సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు |
---|---|---|---|---|
2019 | శ్రీమతి సుబ్బలక్ష్మి | సుబ్రహ్మణ్యం | జీ5 | [14][15] |
2021 | పిట్ట కథలు | హర్ష | నెట్‌ఫ్లిక్స్ | పింకీ సెగ్మెంట్ |
అన్‌హెర్డ్ | అన్వర్ | డిస్నీ+ హాట్‌స్టార్ | [16] |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)