అశోక్ తన్వర్ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | ఆత్మ సింగ్ గిల్ |
తరువాత వారు | చరంజీత్ సింగ్ రోరి |
నియోజకవర్గం | సిర్సా లోక్‌సభ నియోజకవర్గం |
హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు | |
In office 14-02-2014 – 04-09-2019 | |
అంతకు ముందు వారు | ఫూల్ చంద్ ముల్లానా |
తరువాత వారు | కుమారి సెల్జా |
ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు | |
In office ఫిబ్రవరి 2005 – ఫిబ్రవరి 2010 | |
అంతకు ముందు వారు | రణదీప్ సుర్జేవాలా |
తరువాత వారు | రాజీవ్ సాతావ్ |
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు | |
In office 2003–2005 | |
అంతకు ముందు వారు | మీనాక్షి నటరాజన్ |
తరువాత వారు | నదీమ్ జావేద్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హర్యానా, భారతదేశం | 1976 ఫిబ్రవరి 12
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (2019 వరకు), అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (2021) ఆమ్ ఆద్మీ పార్టీ (2022-2024) |
జీవిత భాగస్వామి | అవంతిక మాకెన్ (m. 2005) |
సంతానం | 2 |
తల్లిదండ్రులు | దిల్బాగ్ సింగ్ |
నివాసం | హర్యానా |
చదువు | ఎం.ఎ.(చరిత్ర), ఎం.ఫిల్ (చరిత్ర), పీహెచ్.డి. |
కళాశాల | కాకతీయ విశ్వవిద్యాలయము (వరంగల్) జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ) |
అశోక్ తన్వర్ (జననం 1976 ఫిబ్రవరి 12) భారతీయ రాజకీయ నాయకుడు, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సిర్సా లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) మాజీ అధ్యక్షుడు కూడా. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందాడు.[1]
ఆయన హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని చిమ్నిలో ఒక రైతు కుటుంబంలో దిల్బాగ్ సింగ్, కృష్ణ రాఠీలకు జన్మించాడు.[2][3][4] వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బీఏ చేసాడు. ఆ తరువాత, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని హిస్టారికల్ స్టడీస్ సెంటర్‌కి వెళ్లి తన ఎం.ఎ., ఎం.ఫిల్ పూర్తి చేసాడు. అక్కడే ఆయన మధ్యయుగ భారత చరిత్రపై పిహెచ్.డి పట్లా అందుకున్నాడు.
జెఎన్‌యులో ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తగా అశోక్ తన్వర్ కెరీర్‌ను ప్రారంభించాడు. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేయడంతో ఆయన ప్రాధాన్యత సంతరించుకుంది. అతను 1999లో దానికి కార్యదర్శి అయ్యాడు. తిరిగి 2003లోనూ దాని అధ్యక్షుడయ్యాడు.[5]
అశోక్ తన్వర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఇండియన్ యూత్ కాంగ్రెస్ తన నెట్‌వర్క్‌ను బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వర్క్‌షాప్‌లు, సెమినార్లు, వీధి నాటకాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన సామాజిక కార్యక్రమాల ద్వారా బలోపేతం చేయడానికి ప్రయత్నించింది.
ఆయన 2014 ఫిబ్రవరి 14న హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు.
2009లో హర్యానాలోని సిర్సా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 35499 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే అతను 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కి చెందిన చరణ్‌జీత్ సింగ్ రోరీ చేతిలో ఓడిపోయాడు.[6]
2024 జనవరి 20న, ఆయన న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7]
జూన్ 2005లో, అశోక్ తన్వర్, లలిత్ మాకెన్ కుమార్తె అవంతిక మాకెన్‌ను వివాహం చేసుకకున్నాడు. ఆమె తాత మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు ఆదికర్త, ఒక కుమార్తె అభిస్తద ఉన్నారు.