అసాధ్యుడు (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అనిల్ కృష్ణ |
---|---|
చిత్రానువాదం | అనిల్ కృష్ణ |
తారాగణం | కళ్యాణ్ రామ్, దియా, చలపతిరావు, వినోద్ కుమార్, చరణ్ రాజ్, రతి, సత్యం రాజేష్ |
నిర్మాణ సంస్థ | మహర్షి సినిమా |
విడుదల తేదీ | 16 ఫిబ్రవరి 2006 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అసాధ్యుడు 2006 తెలుగు యాక్షన్ చిత్రం. అనిల్ కృష్ణ రచించి దర్శకత్వం వహించాడు.[1] మహర్షి సినిమా బ్యానర్‌లో వల్లూరుపల్లి రమేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, దియా, చలపతి రావు, రవి కాలే నటించారు. చక్రీ సంగీతం అందించగా, విక్రమ్ ధర్మా యాక్షన్ సన్నివేశాలకు నృత్యాలు చేసాడు. కళ్ళెదురుగా జరిగే అన్యాయాన్ని సహించలేక తిరగబడే విశాఖపట్నానికి చెందిన కాలేజీ విద్యార్థి కథ ఈ సినిమా. హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్, తంబి అనే క్రిమినల్ సోదరుల నేతృత్వంలోని ముఠాతో పోరాడాలని నిర్ణయించుకుంటాడు.
ఈ చిత్ర స్క్రిప్ట్‌ను అనిల్ కృష్ణ ముంబైలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. కల్యాణ్ రామ్ సినిమా తొలి చూపులోనే ప్రోమో చూసాక, అతడితోనే తన సినిమా తీయాలనుకున్నాడు. కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డితో కలిసి అతనొక్కడే షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో సహా వివిధ నటీనటులకు కృష్ణ కథ చెప్పాడు. నిర్మాత మేడికొండ మురళీ కృష్ణకు కూడా ఈ కథ చెప్పాడు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తరువాత, నిర్మాత వల్లూరుపల్లి రమేష్ బాబు కల్యాణ్ రామ్కు ఒక కథను వినడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. ఆ కథ విన్న వెంటనే కళ్యాణ్ రామ్ కృష్ణతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో ఈ చిత్రానికి హీరో పేరిట పార్థు అని పేరుపట్టాలనుకున్నారు. కానీ ఆ తరువాత జరిగిన మార్పులతో ఈ పేరు అసాధ్యుడు అని మార్చారు.[2][3]
2006 ఫిబ్రవరి 16 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కళ్యాణ్ రామ్ నటనకు, యాక్షన్ సన్నివేశాలకూ ప్రశంసలు అందుకుంది.[4][5][6] అయితే, ఇది వాణిజ్యపరంగా విఫలమైంది .[7] దీనిని హిందీ లోకి సర్ఫరోష్ ది బర్నింగ్ యూత్ అనే పేరుతో అనువదించారు.
తన చుట్టూ ఉన్న అసమానతలను ద్వేషించే పార్థు (నందమూరి కళ్యాణ్ రామ్ ) అనే కాలేజీ కుర్రాడు హైదరాబాద్‌లో ఇద్దరు సోదరులు ప్రకాష్ ( రవి కాలే ), తంబి నడుపుతున్న ప్రమాదకరమైన క్రిమినల్ ముఠాతో తలపడడం ఈ సినిమాలో ప్రధానమైన కథ.[8]
సంగీతాన్ని చక్రీ స్వరపరిచాడు. ఆదిత్య సంగీతం వారు పాటలను విడుదల చేశారు. ఆడియో లాంచ్ ఫంక్షన్ 2006 జనవరి 2`5 న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.[9]
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "షికిడాం" | చక్రి | 4:37 | ||||||
2. | "వేటగాడి వాటమున్న" | వాసు, మాలతి | 3:54 | ||||||
3. | "ఔనని కాదని" | హరీష్ రాఘవేంద్ర, స్మిత | 3:50 | ||||||
4. | "కలిసిన సమయాన" | కార్తిక్, కౌసల్య | 3:52 | ||||||
5. | "హైస్సా ఐటం పాపరో" | రవి వర్మ, రాజేష్, టీనా | 4:03 | ||||||
6. | "రాకాసి" | యాకేందర్. ఆర్ | 2:21 | ||||||
7. | "రం రం రాముడే" | సింహ, టిప్పు, సుధ | 3:21 | ||||||
25:58 |