అసీమ్ త్రివేది | |
---|---|
జననం | శుక్లగంజ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1987 ఫిబ్రవరి 17
జాతీయత | భారతీయుడు |
ఉద్యమం | ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్, సేవ్ యువర్ వాయిస్ |
చేసిన పనులు | సామాజిక సేవ |
అవార్డులు | కరేజ్ ఇన్ ఎడిటోరియల్ కార్టూనింగ్ (2012) |
అసీమ్ త్రివేది (జననం 1987 ఫిబ్రవరి 17) ఒక భారతీయ రాజకీయ కార్టూనిస్ట్. అవినీతి వ్యతిరేక కార్టూన్‌లకు ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన దేశంలో ఇంటర్నెట్ సెన్సార్‌షిప్‌కి వ్యతిరేకంగా ఉద్యమం అయిన సేవ్ యువర్ వాయిస్ వ్యవస్థాపక సభ్యుడు. ఆయన అమెరికా ఆధారిత కార్టూనిస్ట్స్ రైట్స్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ "కరేజ్ ఇన్ ఎడిటోరియల్ కార్టూనింగ్ అవార్డ్ 2012" గ్రహీత.
కలర్స్ టీవీలో ప్రసారం చేయబడిన. హిందీ భాషా రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఆరవ సీజన్ లో ఆయన పాల్గొన్నాడు.[1]
అసీమ్ త్రివేది 1987 ఫిబ్రవరి 17న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలోని శుక్లగంజ్‌లో జన్మించాడు. ఆయన 12వ తరగతి వరకు సరస్వతీ విద్యా మందిర్‌లో చదువుకున్నాడు. ఆయన ఫ్రీలాన్స్ కార్టూనిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. అనేక హిందీ భాషా వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లకు పనిచేశాడు.[2]
2011లో, దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం వేగవంతమైంది. ఆయన ఉద్యమానికి మద్దతుగా కార్టూన్ ఆధారిత ప్రచారాన్ని(Cartoons against corruption) ప్రారంభించాడు, ఆయన www.cartoonsagainstcorruption.com వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రముఖ సామాజిక కార్యకర్త.అన్నా హజారే నిరాహారదీక్ష సందర్భంగా ముంబైలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MMRDA) గ్రౌండ్‌లో తన కార్టూన్‌లను ప్రదర్శించాడు.[3][4]
డిసెంబరు, 2011లో "పరువు నష్టం కలిగించే, అవమానకరమైన కార్టూన్‌లను" ప్రదర్శించినందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ ద్వారా ఆయన వెబ్‌సైట్ నిషేధించబడింది. తన వెబ్‌సైట్ నిషేధం తర్వాత, అతను తన కార్టూన్‌లను కొత్త బ్లాగ్‌లో అప్‌లోడ్ చేశాడు.[5]
తన వెబ్‌సైట్‌పై నిషేధం తర్వాత, అసీమ్ త్రివేది తన స్నేహితుడు అలోక్ దీక్షిత్‌తో కలిసి ఇంటర్నెట్ స్వేచ్ఛ కోసం సేవ్ యువర్ వాయిస్ అనే ప్రచారాన్ని ప్రారంభించాడు.[6][7] అనేక నగరాల్లో సృజనాత్మక నిరసనల ద్వారా, సేవ్ యువర్ వాయిస్, భారతదేశంలో ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చను ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద రూపొందించిన కఠినమైన నిబంధనలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం జరిగింది.[8]
మే 2012లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ స్వేచ్ఛ కోసం అసీమ్ త్రివేది నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. భారతదేశంలోని సమాచార సాంకేతిక చట్టం 2011 మధ్యవర్తిత్వ మార్గదర్శక నియమాలకు వ్యతిరేకంగా చేసిన రద్దు తీర్మానానికి మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీలను అభ్యర్థించడమే నిరాహారదీక్ష ఉద్దేశ్యం.[9][10]
భారత పార్లమెంట్, రాజ్యాంగం సమర్థంగా పనిచేయడం లేదంటూ అసీమ్ త్రివేది కార్టూన్లు వేయడంతో రాజద్రోహం ఆరోపణలపై ఆయన 2012 సెప్టెంబరు 9న ముంబైలో అరెస్టు చేయబడ్డాడు.[11] రూ. 5000 వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఒక న్యాయవాది స్వతంత్ర పిటిషన్ ఆధారంగా, దేశద్రోహ ఆరోపణలను తొలగించాలని కోర్టును కోరాడు.
2012 అక్టోబరులో దేశద్రోహ ఆరోపణలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.[12] ఐటి చట్టంలోని సెక్షన్ 66ఎని మార్చి 2015లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.[13][14]
ఆయన వర్జీనియా ఆధారిత కార్టూనిస్ట్స్ రైట్స్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ "కరేజ్ ఇన్ ఎడిటోరియల్ కార్టూనింగ్ అవార్డు" 2012 గ్రహీతగా ప్రకటించబడ్డాడు. ఆయన సిరియన్ కార్టూనిస్ట్ అలీ ఫెర్జాత్‌తో కలిసి అవార్డును పంచుకుంటున్నాడు.[15][16] సత్య బ్రహ్మ స్థాపించిన ఇండియన్ అఫైర్స్ 2016 ఫిబ్రవరి 6న వేబ్యాక్ మెషిన్‌లో ఆర్కైవ్ చేయబడింది,[17] దాని 6వ వార్షిక ఇండియా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ 2015లో ఆయనకి "2015 సంవత్సరపు కార్టూనిస్ట్"గా అవార్డు లభించింది.[18]
ఆయన యూకె ఆధారిత గ్రూప్ ఇండెక్స్ ఆన్ సెన్సార్‌షిప్ ద్వారా ఆర్ట్స్ విభాగంలో 2013 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అవార్డ్స్‌కు కూడా నామినేట్ అయ్యాడు.[19]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)