ఆంటో ఆంటోనీ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 31 మే 2009 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పతనంతిట్ట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మూనిలవు , కేరళ , భారతదేశం | 1957 మే 1||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కురువిళ్ల ఆంటోని చిన్నమ్మ ఆంటోని | ||
జీవిత భాగస్వామి | గ్రేస్ ఆంటో | ||
సంతానం | 2 | ||
నివాసం | వడవత్తూర్, కొట్టాయం, కేరళ నార్త్ అవెన్యూ, న్యూఢిల్లీ, ఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | సెయింట్ థామస్ కాలేజ్, పలై కేరళ లా అకాడమీ, తిరువనంతపురం ప్రభుత్వ న్యాయ కళాశాల, ఎర్నాకులం రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఆంటో ఆంటోనీ పున్నతనియిల్ (జననం 1 మే 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పతనంతిట్ట నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ఆంటో ఆంటోనీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొట్టాయం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కె. సురేష్ కురుప్ చేతిలో 42,914 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కె. అనంత గోపన్ పై 142,914 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఆంటో ఆంటోనీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పీలిపోస్ థామస్ పై 56,191 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి వీణా జార్జ్ పై 44,243 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఆంటో ఆంటోనీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పీలిపోస్ థామస్ పై 66,119 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)