ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురింపబడే మాసపత్రిక.[1][2] తొలిగా 1957 మార్చిలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వెలువడింది[3] ఆ తర్వాత ఉర్దూ భాషలో కూడా ప్రచురించబడిన తెలంగాణ తిరిగి వేరైన తరువాత ఉర్దూ భాషలో ప్రచురణ నిలిపివేయబడింది. 2019 జూన్ సంచికతో పత్రిక విడుదల ఆగిపోయింది. దీనికి కారణం జగన్ ప్రభుత్వ అధికారం చేపట్టిన వివరాలు తొలిగా రూపొందించిన 2019 జూన్ సంచికలో దోషాలుండటంగా చెప్పబడింది. తరువాత కొద్ది సవరణలు చేసిన పత్రికను వెబ్సైట్లో చేర్చారు.[4]
ప్రతి సంచికలో ప్రభుత్వ సమాచారంతో పాటు, కథలు, కవిత్వం, వ్యంగచిత్రాలు వుండేవి.
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు ప్రారంభించిన పత్రిక. ఎప్పటి కప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని పంచాయితీ కార్యాలయాలు మొదలుకొని మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీలో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ప్రచారం కలిపించేది.