ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ | |
---|---|
AP CRDA అమరావతిలో ఉప కార్యాలయం | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 2014 |
Preceding agency | విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ |
అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం |
ప్రధానకార్యాలయం | విజయవాడ 16°30′30″N 80°38′30″E / 16.50833°N 80.64167°E |
సంబంధిత మంత్రి | బొత్స సత్యనారాయణ |
కార్యనిర్వాహకులు | విజయ కృష్ణన్, కమిషనర్ |
అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30 న ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[1][2][3] ఈ సంస్థ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో పట్టణ సేవలు పర్యవేక్షిస్తుంది.[4]
దీని అధికార పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8,352.69 km2 (3,224.99 sq mi) మేర విస్తరించి ఉంది. అమరావతి నగరం కూడా ఈ అథారిటీ క్రిందికి వస్తుంది.[5][6]
రాజధాని వికేంద్రీకరణ వివాదం వలన కొన్నాళ్లు అస్థిత్వం కోల్పోయి, రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టం రద్దు చేయడంవలన మరల ఉనికిలోకి వచ్చింది.
శ్రీకాంత్ నాగులపల్లి మొదటగా అధికార కమిషనర్ గా పనిచేశాడు. As of 2022[update] విజయ కృష్ణన్ కమీషనర్ గా పనిచేస్తున్నది. [7]