ఆంధ్రప్రదేశ్ శాసనమండలి | |
---|---|
![]() | |
రకం | |
రకం | |
కాల పరిమితులు | 6 సంవత్సరాలు |
చరిత్ర | |
స్థాపితం | 1958 జులై 1 – 1982 మే 31; 2007 మార్చి 30 – ప్రస్తుతం |
అంతకు ముందువారు | ఆంధ్ర రాష్ట్ర శాసనమండలి |
నాయకత్వం | |
సయ్యద్ అబ్దుల్ నజీర్ 2023 ఫిబ్రవరి 24 నుండి | |
సెక్రటరీ జనరల్ | సూర్యదేవర ప్రసన్న కుమార్ 2024 జులై 15 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 58 ( ఎన్నిక 50 + నామినేటెడ్ 8 ) |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం(10)
ఖాళీ (5)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఒకే బదిలీ చేయగల ఓటు విధానం |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2024 ఆగస్టు 16 |
తదుపరి ఎన్నికలు | 2024 |
సమావేశ స్థలం | |
![]() | |
కౌన్సిల్ భవనం అమరావతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ.[1] 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014[2] లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి కొనసాగుతుంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆంధ్రా ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంది. 1953 అక్టోబరు 1 న[3] ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది, తరువాత 1956 లో తెలంగాణ ప్రాంతంతో కలపి 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంగా అవతరించింది. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి 1958 వరకు ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థగా పనిచేసింది. 1956 డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి ఏర్పాటు చేయుటకు తీర్మానం చేసింది. ఈ వ్యవస్థ మూలంగా రెండు సభలు ఉంటాయి.[4] అధికారికంగా విధాన పరిషత్తు 1958 జూలై 1 న ప్రారంభించబడింది. ఈ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా జరిగింది. 1958 జూలై 7న అప్పటి భారత రాష్ట్రపతి, రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేశాడు.[4]
1980 వ దశకంలో, ఎగువ సభలను రద్దు చేయాలని కోరిన రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది ప్రజా ప్రాతినిధ్యం లేనిదని, రాష్ట్ర బడ్జెట్ పై భారమని, చట్టం ఆమోదించడంలో జాప్యాలకు కారణమనే విమర్శలతో రద్దు చేయటకు నాటి టీడిపి ప్రభుత్వం నిర్ణయించింది.[4][5][6][7] ఆ విధంగానే రద్దు తీర్మానాన్ని అసంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏదేమైనా అప్పటి పాలక పార్టీ తెలుగుదేశం రాజకీయ ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెసుకు శాసన మండలిలో ఎక్కువ సీట్లు ఉండటంవల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టాలు అవ్వడానికి ఆలస్యం జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.[7]
ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించి పంపిన తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (రద్దు) చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేసింది.
1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) కు చెందిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శాసన మండలిని పునరుద్ధరించడానికి తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాడు.[4][7] శాసన మండలిని పునరుద్ధరించడానికి ఒక తీర్మానం 1990 జనవరి 22 న విధానసభలో ఆమోదించబడింది.[4]
1990 మే 28 న రాష్ట్ర విధానసభ (అసంబ్లీ) తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ) లో శాసన మండలి పునరుద్ధరణకు అధికారమిచ్చిన శాసనం ఆమోదం పొంది దిగువ సభైన లోక్‌సభ ఆమోదానికి పంపబడింది. కానీ అర్ధంతరంగా 1991 లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు నిలిచిపోయింది.[4] తరువాత వచ్చిన లోక్‌సభలు (1991–1996, 1996–1998, 1998–2004) ఈ విషయంపై ఎలాంటి చర్యా తీసుకోలేదు.
2004 ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ 2004 జూలై 8 న శాసన మండలి పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది.[4] కేంద్రం ప్రభుత్వం 2004 డిసెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2006 డిసెంబరు 15 న లోక్‌సభ ఆమోదం, డిసెంబరు 20 న రాజ్యసభ ఆమోదం పొంది, 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది.[4] నూతనంగా పునరుద్ధరించబడిన శాసన మండలి 2007 మార్చి 30 న ఏర్పాటు చేయబడింది, ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ చేత ప్రారంభించబడింది.[4]
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను అసంబ్లీ ఆమోదించిన తర్వాత, శాసనమండలి నిశితమైన పరిశీలన కొరకు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం పై చర్చకు తెదేపా హాజరుకాలేదు. జనసేన శాసనసభ్యుడు అంగీకారం తెలిపారు దీనితో 133-0 ఆధిక్యంతో ఆమోదం పొందింది (మామూలుగా హాజరైన సభ్యులలో యాభై శాతానికి మించి ఆమోదిస్తే సరిపోతుంది). ఈ బిల్లును కేంద్రం పెండింగ్ లో ఉంచింది.[8] 2021 లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంది.[9]
కౌన్సిల్ చేత ఎన్నుకోబడిన చైర్‌పర్సన్, కౌన్సిల్ యొక్క సెషన్లకు అధ్యక్షత వహిస్తారు. చైర్‌పర్సన్ అందుబాటులోకి లేని సమయంలో సభను నిర్వహించడానికి డిప్యూటీ చైర్‌పర్సన్ ను కూడా ఎన్నుకుంటారు. విరిరువురు ఏదైనా కారణం చేత సభకు హాజరు కాని పక్షంలో చైర్‌పర్సన్ ల ప్యానల్ లోని ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు . ఈ చైర్‌పర్సన్ ల ప్యానల్ ను చైర్‌పర్సన్ తాను బాధ్యతలు తీసుకున్న మొదటి సేషన్ లోనే 10 మందికి మించకుండా నిర్ణయిస్తారు. చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు చైర్‌పర్సన్ ల ప్యానల్ లోని సభ్యులు సభకు అధ్యక్షత వహించలేరు. ఆ సమయంలో గవర్నర్ సభలో అందరికంటే సినియర్ సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయతి.[10]
శాసన మండలి శాశ్వత సభ.[4] ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరుసంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు.[4] శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.
20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 10 మంది సభ్యులు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు . ఆంధ్రప్రదేశ్ గవర్నరు ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు.[11]
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే శాసనమండలి ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికలలో ఓటరు ఒకరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి తమ ఓటును ప్రాధాన్యతల ద్వారా సూచించాల్సివుంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ క్రిందివిధంగా ఉంటుంది.
ఉదాహరణకు నలుగురు అభ్యర్థులు ఒక శాసనమండలి స్థానం కొరకు బరిలో ఉంటే. ఓటరు తమ ఓటును ప్రాధాన్యతా క్రమంలో సూచించవల్సి ఉంటుంది. అంటే 1, 2, 3, 4 అని ఆంగ్ల సంఖ్యలతోగాని I, II, III, IV అని రోమన్ సంఖ్యలతోగాని లేదా 8 వ షెడ్యూల్ లో ఉన్న ఏ భాష సంఖ్యలతోనైన అభ్యర్థికి తమ ప్రాధాన్యతను సూచించవచ్చు. ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యత మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వాలి, లేదంటే తమ ఓటు చెల్లదు. మిగిలిన ప్రాధాన్యతలు ఇచ్చేది లేనిది ఓటరు ఇష్టం.
మొదటిగా చెల్లని ఓట్లని బ్యాలెట్ పెట్టెల నుంచి వేరు చేస్తారు. తొలి ప్రాధాన్యత ఓటు లేని బ్యాలెట్ పత్రాన్ని చెల్లనిదిగానే పరిగణిస్తారు (తరువాతి ప్రాధాన్యతలు ఉన్నా). చెల్లుబాటైన వాటిల్లో తొలి ప్రాధాన్య ఓట్లు ముందుగా లెక్కిస్తారు, వాటిలో 50 శాతానికి మించి ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్లు. అలా జరగకపోతే ఆ సమయానికి అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చి చిట్టచివరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి తొలి ప్రాధాన్యంగా వున్న బ్యాలెట్ పత్రంలో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడ్డాయో గుర్తించి ఆయా అభ్యర్థులకు వాటిని బదలాయిస్తారు. అప్పుడు ఏ అభ్యర్థికైతే 50 శాతం కంటే అధికంగా ఓట్లు వస్తాయో వారు గెలిచినట్లు. అప్పుడు కూడా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికీ రాకుంటే, తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి తొలి ప్రాధాన్యంగా వున్న బ్యాలెట్ పత్రంలో ఆ అభ్యర్థి రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు. అలా ఒకరికైనా 50 శాతం కంటే ఒక్క ఓటైనా అధికంగా వచ్చేంతవరకూ లెక్కింపు కొనసాగించి ఫలితం ప్రకటిస్తారు.[12]
కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడిన ఛైర్మన్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఛైర్మన్ గైర్హాజరీలో అధ్యక్షత వహించడానికి డిప్యూటీ ఛైర్మన్‌ని కూడా ఎన్నుకుంటారు.[13][14]
హోదా | పేరు |
---|---|
గవర్నర్ | ఎస్. అబ్దుల్ నజీర్ |
ఛైర్మన్ | కొయ్యే మోషేన్‌రాజు (YSRCP) |
డిప్యూటీ ఛైర్మన్ | జకియా ఖానమ్ (YSRCP) |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) |
ఎన్. చంద్రబాబు నాయుడు (టీడీపీ) |
ప్రతిపక్ష నాయకుడు | బొత్స సత్యనారాయణ (వై.ఎస్.ఆర్.సి.పి) |
Keys: YSRCP (10) TDP (6) JSP (1) ఖాళీ (3)
వ.సంఖ్య | పేరు | పార్టీ | పదవీ కాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|
1 | పి.వి.వి.సూర్యనారాయణ రాజు | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
2 | ఖాళీ 2024 ఆగస్టు 28 నుండి [15] | 2029 మార్చి 29 | |||
3 | బొమ్మి ఇజ్రాయిల్ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
4 | జయమంగళ వెంకటరమణ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
5 | చంద్రగిరి ఏసురత్నం | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
6 | మర్రి రాజశేఖర్ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
7 | దేవసాని చిన్న గోవిందరెడ్డి | వైకాపా | 2021 నవంబరు 29 | 2027 నవంబరు 28 | |
8 | పాలవసల విక్రాంత్ | వైకాపా | 2021 నవంబరు 29 | 2027 నవంబరు 28 | |
9 | ఇసాక్ బాషా | వైకాపా | 2021 నవంబరు 29 | 2027 నవంబరు 28 | |
10 | ఖాళీ 2024 ఆగస్టు 30 నుండి [16] | 2027 మార్చి 29 | |||
11 | దువ్వాడ శ్రీనివాస్ | వైకాపా | 2021 మార్చి 30 | 2027 మార్చి 29 | |
12 | మహమ్మద్ రుహుల్లా | వైకాపా | 2022 మార్చి 21 | 2027 మార్చి 29 | |
13 | పంచుమర్తి అనురాధ | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
14 | సి. రామచంద్రయ్య | తెదేపా | 2024 జూలై 08 | 2027 మార్చి 29 | |
15 | యనమల రామకృష్ణుడు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
16 | పర్చూరి అశోక్ బాబు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
17 | బెందుల తిరుమల నాయుడు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
18 | దువ్వారపు రామారావు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
19 | పిడుగు హరిప్రసాద్ | Jana Sena Party | 2024 జూలై 08 | 2027 మార్చి 29 | |
20 | ఖాళీ 2024 మే 17 నుండి [17] | 2025 మార్చి 29 |
Keys: YSRCP (20)
వ.సంఖ్య | నియోజకవర్గం | సభ్యుని పేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|---|
1 | చిత్తూరు | సిపాయి సుబ్రహ్మణ్యం | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
2 | తూర్పు గోదావరి | కుడుపూడి సూర్యనారాయణ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
3 | కర్నూలు | ఎ. మధుసూదన్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
4 | శ్రీకాకుళం | నర్తు రామారావు | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
5 | నెల్లూరు | మేరిగ మురళీధర్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
6 | పశ్చిమ గోదావరి | కవురు శ్రీనివాస్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
7 | పశ్చిమ గోదావరి | వంక రవీంద్రనాథ్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
8 | అనంతపురం | సానిపల్లి మంగమ్మ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
9 | కడప | పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
10 | అనంతపురం | యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
11 | చిత్తూరు | కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
12 | తూర్పు గోదావరి | అనంత సత్య ఉదయభాస్కర్ | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
13 | గుంటూరు | మురుగుడు హనుమంతరావు | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
14 | గుంటూరు | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
15 | కృష్ణా | మొండితోక అరుణ్ కుమార్ | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
16 | కృష్ణా | తలశిల రఘురాం | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
17 | ప్రకాశం | తూమాటి మాధవరావు | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
18 | విశాఖపట్నం | వరుదు కల్యాణి | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
19 | విశాఖపట్నం | బొత్స సత్యనారాయణ | వైకాపా | 2024 ఆగస్టు 21 | 2027 డిసెంబరు 1 | |
20 | విజయనగరం | ఇందుకూరి రఘురాజు | వైకాపా | 2027 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 |
Keys: TDP (3) PDF (2)
వ.సంఖ్య | నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|---|
1 | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | వేపాడ చిరంజీవిరావు | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
2 | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | కంచర్ల శ్రీకాంత్ | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
3 | అనంతపురం, కర్నూలు, కడప | భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
4 | పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి | ఇళ్ల వెంకటేశ్వరరావు | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | ||
5 | కృష్ణా జిల్లా, గుంటూరు | కలగర సాయి లక్ష్మణరావు | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 |
5 సీట్లు ఉపాధ్యాయ ప్రతినిధులకున్నాయి.
జిల్లా | పేరు | ఎన్నికైన పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం ముగింపు | ||
---|---|---|---|---|---|---|
శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | పాకలపాటి రఘువర్మ | స్వతంత్ర | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | ||
తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి | బొర్రా గోపి మూర్తి [18] | స్వతంత్ర | 2024 డిసెంబరు 9 | 2027 మార్చి 29 | ||
కృష్ణా, గుంటూరు | టి.కల్పలత [19] | స్వతంత్ర | 2021 మార్చి 30 | 2027 మార్చి 29 | ||
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | ||
అనంతపురం, కర్నూలు, కడప | ఎం. వి. రామచంద్రారెడ్డి | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 |
ఈ వర్గంలో ఎనిమిది సీట్లున్నాయి.
వ.సంఖ్య | పేరు | నామినేట్ చేసిన పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
---|---|---|---|---|
1 | పండుల రవీంద్రబాబు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2020 జూలై 28 | 2026 జూలై 27 |
2 | జకియా ఖానమ్ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2020 జూలై 28 | 2026 జూలై 27 |
3 | తోట త్రిమూర్తులు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
4 | కొయ్యే మోషేన్‌రాజు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
5 | రాజగొల్ల రమేశ్ యాదవ్ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
6 | 2029 ఆగస్టు 09 | |||
7 | కుంభా రవిబాబు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2023 ఆగస్టు 10 | 2029 ఆగస్టు 09 |
8 | లేళ్ల అప్పిరెడ్డి | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
<ref>
ట్యాగు; :0
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు