ఆంధ్రరాష్ట్రం | |
---|---|
Anthem: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" | |
Coordinates: 16°30′N 80°38′E / 16.50°N 80.64°E | |
దేశం | India |
రాష్ట్రావతరణ | 1 అక్టోబర్ 1953 |
రాజధాని నగరం | కర్నూలు |
పెద్ద నగరం | విశాఖపట్నం |
జిల్లాలు | 13 |
Government | |
• Body | ఆంధ్ర ప్రభుత్వం |
• గవర్నరు | సి.ఎం.త్రివేది |
• ఆంధ్ర ముఖ్యమంత్రులు | 1.టంగుటూరి ప్రకాశం పంతులు1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు
2.రాష్ట్రపతి పాలన 1954నవంబర్ 15 నుంచి 1955మార్చి 28 వరకు 3.బెజవాడ గోపాలరెడ్డి1955మార్చి 28నుండి1956నవంబర్ 1 వరకు |
• హైకోర్టు | హైకోర్టు,గుంటూరు |
Demonym | తెలుగు / ఆంధ్రులు |
Time zone | UTC+05:30 (IST) |
ఆంధ్రరాష్ట్రం, భారతదేశపు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది.[1]
మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు.[2] ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్.ఎస్ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన తెలంగాణ ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
58 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమల్లోకి వచ్చింది. 2014 జూన్ 2న అధికారికంగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి
1956 నవంబరు 1న, హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగుభాష మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాల్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కలిపింది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)