ఆకతాయి (2017 సినిమా)

ఆకతాయి
దర్శకత్వంరోమ్ భీమన
నిర్మాతకె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్. కౌశల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్
తారాగణంఆశిష్ రాజ్, రుక్సార్ ధిల్లన్
ఛాయాగ్రహణంవెంకట్ గంగాధరి
కూర్పుఎం ఆర్ వర్మ
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
వీకేఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2017 మార్చి 10
సినిమా నిడివి
2:30:00
దేశంఇండియా
భాషతెలుగు

ఆకతాయి 2017 లో తెలుగు చలనచిత్రం. వికెఏ ఫిలిమ్స్ పతాకంపై కె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్. కౌశల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్ లు ఈ చిత్రాన్ని నిర్మించగా, రోమ్ భీమన దర్శకత్వం వహించాడు. ఆశిష్ రాజ్, రుక్సార్ ధిల్లన్, సుమన్, రాంకీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు.

బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించింది. మణి శర్మ సంగీతాన్ని సమకూర్చాడు.