ఆచార్య దేవవ్రత్ | |
---|---|
గుజరాత్ రాష్ట్ర 20వ గవర్నరు | |
Assumed office 2019 జులై 22 | |
అధ్యక్షుడు | రాంనాథ్ కోవింద్ |
ముఖ్యమంత్రి | |
అంతకు ముందు వారు | ఓం ప్రకాష్ కోహ్లీ |
హిమాచల్ ప్రదేశ్ 18వ గవర్నరు | |
In office 2015 ఆగస్టు 12 – 2019 జులై 21 | |
ముఖ్యమంత్రి |
|
అంతకు ముందు వారు | కళ్యాణ్ సింగ్ |
తరువాత వారు | కల్రాజ్ మిశ్రా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1] పంజాబ్ | 1959 జనవరి 18
ఆచార్య దేవవ్రత్, (జననం: 1959 జనవరి 18) భారతదేశానికి చెందిన విద్యావేత్త, 2019 జూలై 22 నుండి గుజరాత్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2] హిమాచల్ ప్రదేశ్ 18వ గవర్నరుగా 2015 ఆగస్టు 12 నుండి 2019 జులై 21 వరకు పనిచేసాడు.[3] ఇతను ఒక ఆర్య సమాజ్ ప్రచారక్, అంతకు పూర్వం హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో ఒక గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.[4][5][6][1] గుజరాత్ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉన్నాడు.
దేవవ్రత్ 1984 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. వాతావరణ కాలుష్య నివారణపై విస్తృత కార్యచరణ నిర్వహిస్తున్నాడు. ఐరోపా అగ్నేసియా దేశాలలో భారతీయ సంస్కృతి ప్రచార కర్తగా కార్యక్రమాలు నిర్వహించాడు.