ఆచార్య నరేంద్ర దేవ్ (1889 అక్టోబరు 30 - 1956 ఫిబ్రవరి 19) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ పట్టణంలో జన్మించాడు.[1] అతను భారతదేశ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతకర్తలలో ఒకడు. అతని ప్రజాస్వామ్య సోషలిజం, హింసాత్మక మార్గాలను సూత్రప్రాయంగా త్యజించి, సత్యాగ్రహాన్ని విప్లవాత్మక వ్యూహంగా స్వీకరించింది.[2] అతని తండ్రి బాబు బలదేవ్ సహాయ్ పజియాబాద్ లో పేరుపొందిన న్యాయవాది.[3]
దేవ్ మొదటగా 1915లో బాలగంగాధర తిలక్, అరబిందో ఘోష్ ప్రభావంతో జాతీయవాదానికి ఆకర్షితుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా అతను మార్క్సిజం, బౌద్ధ మతంపై ఆసక్తి పెంచుకున్నాడు. అతను హిందీ భాష ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించినప్పటి నుండి దానికి కీలక నాయకుడుగా పనిచేసాడు. స్వాతంత్ర్య పోరాటంలో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. తన కెరీర్‌లో రెండుసార్లు నరేంద్ర దేవ్ యుపి శాసన సభకు ఎన్నికయ్యాడు. కానీ, రెండుసార్లు కూడా అతను మంత్రివర్గంలో చేరడానికి నిరాకరించాడు, దానికి కారణం కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అలాంటి భాగస్వామ్యానికి అనుకూలంగా లేదు.[1] అతను 1947-1951[4] వరకు లక్నో విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేశాడు. తరువాత 1951 డిసెంబరు నుండి 1954 మే 31 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా పనిచేశాడు. అతనికి రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్త, కార్యనిర్వాహక సంఘ సభ్యుడు నిర్మల్ చంద్ర చతుర్వేది విశ్వవిద్యాలయం విస్తరణ కోసం అనేక ప్రాజెక్టులను ప్రారంభించి సహాయపడ్డాడు.
నరేంద్ర దేవ్ పేదరికం, దోపిడీని కేవలం మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదం ద్వారా కాకుండా ప్రత్యేకంగా నైతిక, మానవీయ ప్రాతిపదికన నిర్మూలించాడు. "సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం ఒక బూటకమని" నొక్కి చెప్పాడు. దేవ్ రైతు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సోషలిస్ట్ పార్టీ (భారత్), దాని వారసత్వ పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీతో 1956లో అతను మరణించే వరకు సంబంధాలు కలిగి ఉన్నాడు.
అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఇలా అన్నాడు: "ఆచార్య నరేంద్ర దేవ్ భారతదేశ గొప్ప కుమారులలో ఒకడు, దేశం అతనికి ఎంతో రుణపడి ఉంది."
1975లో స్థాపించిన విశ్వవిద్యాలయానికి అతని గౌరవార్థం "నరేంద్ర దేవ్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం" అనే పేరుపెట్టారు.
రాజ్యసభలో భావోద్వేగ సంస్మరణలో, జవహర్‌లాల్ నెహ్రూ ఇలా అన్నాడు:
దేవి కాశీ విద్యాపీఠంలో ప్రొఫెసర్‌గా, లక్నో విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసాడు. 67 సంవత్సరాల వయస్సులో ఫిబ్రవరి 19, 1956 న మద్రాసులో మరణించాడు.[1]