ఆటోనగర్ సూర్య[1] | |
---|---|
దర్శకత్వం | దేవా కట్టా |
రచన | దేవా కట్టా |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి ఆర్.ఆర్.వెంకట్ (సమర్పణ) |
తారాగణం | నాగ చైతన్య సమంత రకుల్ ప్రీత్ సింగ్ |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ నరోజు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
విడుదల తేదీ | 27 జూన్ 2014 |
సినిమా నిడివి | 157 నిమిషాలు[2] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹250 మిలియను (US$3.1 million)[3] |
ఆటోనగర్ సూర్య 2014 జూన్ 27న విడుదలైన తెలుగు చిత్రము.
చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ (సాయి కుమార్) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు. జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'.
టైమ్ ఎంత రా , రచన: అనంత శ్రీరామ్, గానం. విజయ్ ప్రకాష్ కోరస్
మంచెలి , రచన: అనంత శ్రీరామ్, గానం.అనూప్ రూబెన్స్
ఆటోనగర్ బ్రహ్మీ , రచన: అనంత శ్రీరామ్, గానం.బ్రహ్మంనందం , వేణు మాధవ్ , అనుప్ రూబెన్స్ , సాయి చరన్, అమృత వర్షిణి, ప్రణతి
సుర సుర , రచన: అనంత శ్రీరామ్, గానం.అనూప్ రూబెన్స్, కె ఎస్ చిత్ర , సంతోష్ , రాంకీ
హైదరాబాద్ బిరియాని , రచన: అనంత శ్రీరామ్, గానం.రిత్పతక్ కోరస్
ఆయుధం , రచన: అనంత శ్రీరామ్, గానం.దేవ కట్టా, సిద్దార్ధ, రఘు
థీమ్ సాంగ్ , రచన: అనంత్ శ్రీరామ్, గానం.అనూప్ రూబెన్స్.