ఆనందం | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | శ్రీను వైట్ల చింతపల్లి రమణ (మాటలు) |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ఉషా కిరణ్ మూవీస్ |
పంపిణీదార్లు | మయూరి |
విడుదల తేదీ | 28 సెప్టెంబరు 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది. అన్ని భాషల్లోనూ రామోజీ రావు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
కిరణ్, ఐశ్వర్య చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్ళలో నివసిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికీ గొడవలు పడుతూ ఉంటారు. కళాశాలకు వెళ్ళే వయసొచ్చినా సరే ఒకరినొకరు ఆటపట్టించుకుంటూనే ఉంటారు. ఒకసారి ఐశ్వర్య కుటుంబం ఇల్లు ఖాళీ చేసే ఊటీ వెళ్ళిపోతారు. తన శత్రువు పక్కనుంచి వెళ్ళిపోయినంతగా సంబరాలు చేసుకుంటాడు కిరణ్. ఊటీ వెళ్ళిన ఐశ్వర్యకు దీపిక పేరుతో వచ్చిన ఉత్తరం, గ్రీటింగ్ కార్డు కనబడతాయి. తాముండే ఇంట్లో పూర్వం దీపిక కుటుంబం ఉండేదనీ ఆమెకు ఆ ఉత్తరం, గ్రీటింగ్ కార్డు చేర్చాలని ప్రయత్నించిన ఐశ్వర్యకు దీపిక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనే చేదు నిజం ఆమె స్నేహితురాలి ద్వారా తెలుస్తుంది. దీపిక, వంశీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. వెంకట్ తమ ప్రేమ విషయం చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాలని ఊరు వెళతాడు. రోజులు గడుస్తున్నా అతను తిరిగి రాకపోయేసరికి దీపిక ఇంట్లో ఆమెకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెడతారు. సున్నితమనస్కురాలైన ఆమె ఇష్టం లేని పెళ్ళి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. దీపిక చనిపోయిందన్న నిజం వంశీకి తెలిస్తే ఏమవుతుందోనని ఆమె పేరుతో ఐశ్వర్య బదులు రాయడం ప్రారంభిస్తుంది. మరో వైపు వంశీ ఓ ప్రమాదంలో మరణించి ఉంటాడు. అతని స్నేహితుడు కిరణ్, వంశీ ప్రేయసి అతని మరణం గురించి తెలిస్తే తట్టుకోలేదని అతని తరపున ఉత్తరాలు రాస్తుంటాడు. చివరికి ఇద్దరు బద్ధశత్రువుల మధ్య వైరం స్నేహితుల ప్రేమ కోసం చేసిన పని వల్ల ప్రేమగా ఎలా మారిందనేది మిగతా కథ.
సెప్టెంబరు 28, 2001 లో విడుదలైన ఈ చిత్రం 200 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది.[3]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఆనందం" | టిప్పు | 4:22 |
2. | "కనులు తెరచిన" | మల్లికార్జున్, సుమంగళి | 4:41 |
3. | "మోనాలీసా" | దేవిశ్రీ, కల్పన | 5:01 |
4. | "ఎవరైనా ఎపుడైనా" | ప్రతాప్ | 1:57 |
5. | "ఎవరైనా ఎపుడైనా" | చిత్ర | 1:58 |
6. | "ఒక మెరుపు" | సునితారావు | 5:08 |
7. | "ప్రేమంటే ఏమిటంటే" | దేవిశ్రీ, మల్లికార్జున్, సుమంగళి | 5:19 |
8. | "థీమ్ మ్యూజిక్ (వాయిద్యం)" | దేవిశ్రీ | 1:28 |
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)