ఆనందమానందమాయె | |
---|---|
![]() ఆనందమానందమాయె సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | దివాకర్ బాబు (మాటలు) |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | జై ఆకాశ్, రేణుకా మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా |
ఛాయాగ్రహణం | అజయ్ విన్సెంట్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆనందమానందమాయె 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా, సునీల్, దేవన్, శివాజీ రాజా, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్.ఎస్.నారాయణ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు. ఇది నవదీప్ తొలి చిత్రం.[1][2]
ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతంను కోటి అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, సాయి శ్రీహర్ష, కందికొండ యాదగిరి పాటలు రాయగా... శ్రీరామ చంద్ర, సునీత, కార్తీక్, రఘు కుంచె, మాలతి, శ్రేయా ఘోషాల్ మొదలైనవారు పాడారు.
1: నీకో మాటండి
2: నీకన్నులలోని
3: నదిలో అలలే
4: మేలుకొని కలలు
5: మా మధు
6: ఆగాలి కాలం