ఆనంద్ రతన్ యాదవ్ (1935 నవంబరు 30 - 2016 నవంబరు 27) భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన మరాఠీ రచయిత. ఆయన తన ఆత్మకథ జోంబీ (झोंबी)తో ప్రసిద్ధి చెందాడు.
ఆయన 1935 నవంబరు 30న మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కాగల్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి నిరక్షరాస్యుడైన రైతు, ఆనంద్ యాదవ్ ని చదివిపించడం ఇష్టం లేదు. అయితే, చిన్న వయస్సులోనే ఆనంద్ యాదవ్ ఇంటి నుండి పారిపోయి, అనేక కష్టాలను ఎదుర్కొని, పూణే విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ వంటి ఉన్నత విద్యను పొందాడు. ఆయన రాసిన జోంబి, నంగరాణి వంటి పుస్తకాలు ఆయన విద్య కోసం చేసిన పోరాటాన్ని వర్ణిస్తాయి.ఆయన 2016లో పూణేలో మరణించాడు.[1]
మరాఠీ గ్రామీణ సాహిత్యం అంటే మహారాష్ట్రలోని గ్రామీణ జీవితానికి సంబంధించిన సాహిత్యం కు సంబందించి ప్రారంభ రచయితలలో యాదవ్ ఒకడు. ఆయన నవల "జోంబీ" ("అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం") 1990లో సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. ఈ నవల ఒక చిన్న పిల్లవాడు, అతని ప్రేమగల తల్లి, అతని పూర్తి పేదరికం జీవితం, చదువుకోవాలనే అతని ఆత్రుతకు సంబంధించి స్వీయచరిత్ర కథ. యాదవ్ ఆత్మకథాత్మక జోంబీ మూడు సీక్వెల్లను రాసాడు (నంగరణి (నాంగరణి) (మట్టి సాగు అని అర్ధం) ఘరభింటి (ఇంటి గోడలు), కచవెల్ (కాచవెల్) (గాజు ముక్కల తీగ అని అర్ధం). ప్రముఖ మరాఠీ చిత్రం నటరంగ్ యాదవ్ నవల నటరంగ్ ఆధారంగా రూపొందించబడింది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ మరాఠీ పాఠ్యపుస్తకంలో గావచి సంస్కృతి హే గావచే వ్యక్తిమా పాఠం ఆయన పుస్తకం నుండి తీసుకోబడింది.
మార్చి 2009లో మహాబలేశ్వర్ లో జరిగిన 82వ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి యాదవ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే, ఆయన జీవిత చరిత్ర నవల సంతసూర్యా తుకారాం (సంతసూర్యా తుకారామ) లోని కొన్ని విషయాలకు వ్యతిరేకంగా ప్రధానంగా వర్కరి మహామండల్ సభ్యులు చేసిన నిరసనలకు ప్రతిస్పందనగా ఆయన సమావేశానికి నాలుగు రోజుల ముందు ఆ పదవికి రాజీనామా చేసాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మేళనానికి అంతరాయం కలిగిస్తామని హెచ్చరిస్తూ ఆయన రాజీనామా చేయాలని మహామండల్ సభ్యులు డిమాండ్ చేశారు.[2][3]